ఎమ్మార్వో కారును 30 నిమిషాలు వేటాడిన ఆవు

August 13, 2020

WANAPARTHY : సాధారణంగా వీధుల్లో వెళ్తున్న వాహనాలను కుక్కుల వెంబడించడం చూస్తుంటాం. కానీ సాధు జీవి అయిన ఆవు ఏనాడు వెంబడించదు. అయితే, వనపర్తిలో విచిత్రం జరిగింది. స్థానిక ఎమ్మార్వో కారును ఆవు వెంబడించింది. అంటే ఏ పది ఇరవై అడుగులో కాదు... అరగంట పాటు వెంబడిస్తూనే ఉంది. 

కారును ఆనుకుని పక్కన రాసుకుంటూ వెంబడించింది. కారును ఆపితే ఆగుతుంది, కారు కదిలిస్తే వెంటే వేస్తుంది. ఇలా నాలుగు సార్లు చేసిన ఆవు పక్కకు పోలేదు. కారు చుట్టూ తిరుగుతోంది. పక్కనే అనేక వాహనాలు వస్తూ పోతూ ఉన్నాయి. కానీ ఏ వాహనాన్ని ఆవు పట్టించుకోలేదు. ఎమ్మార్వో వాహనం వెంబడే తిరుగుతోంది. దీనిని కొందరు వీడియో తీశారు. అదిపుడు వైరల్ అవుతోంది.

దీనిపై ఎమ్మార్వో స్పందిస్తూ ఆవు తనపై ప్రేమతోనే వెంబడించింది అన్నారు. అలా వెంబడించడానికి అది ఆయన సొంత ఆవు కాదు. అరగంట తర్వాత జనం పెద్ద ఎత్తున గుమిగూడటంతో అది బెదిరి పక్కకుపోయింది. 

 

 

ఆవు యజమానికి గాని, ఆవు దూడకు గాని, ఏదైనా గోశాలకు గాని ఎమ్మార్వో చర్యల వల్ల నష్టం కలగడంతో అదిలా వెంబడించిందా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. వాటి సంగతి తెలియడం లేదు గాని గోమాత చర్య మాత్రం పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.  అయితే కొందరు నెటిజన్ల నుంచి ఎలాంటి ఆరోపణలు వస్తున్నాయో కింది ఫొటో చూడండి. 

Read Also

అమరావతిలో జగన్ కొత్త ప్లాన్
ప్రభుత్వ ఉద్యోగులకు షాక్ !
WHO : నవనాడులు కుంగిపోయే మాట చెబుతావేం సామీ!!