బాబుని తిడ‌తావా? మ‌ంత్రి ప‌ద‌వి వ‌దులుకుంటావా ?

May 25, 2020

కొడాలి నానికి సీఎం జ‌గ‌న్ రెడ్డి వార్నింగ్‌
మంత్రి ప‌ద‌వి పోతుంద‌నే బెంగ‌తో మీడియా ముందుకొచ్చిన నాని
పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖా మంత్రి కొడాలి నాని ప్రెస్‌మీట్ క‌థ ఇది

చాలా రోజులుగా బూతుల నోరేసుకుని మీడియా ముందుకురాని పౌర‌స‌ర‌ఫ‌రాల‌శాఖా మంత్రి కొడాలి నాని మ‌ళ్లీ త‌న‌దైన శైలి బూతుల‌తో మీడియా ముందుకొచ్చారు. వైకాపా నాయ‌కుల‌కు విన‌సొంపుగా చంద్ర‌బాబుని తిట్టిపోశారు. అయితే ఈ గ్యాప్ ఎందుకొచ్చింది? ఈ గ్యాప్లో ఏం జ‌రిగింది? అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై ప్ర‌ముఖ చాన‌ళ్ల‌లోనూ, సాక్షి అనుబంధ సంస్థ‌లైన సాక్షి-2 (గ‌తంలో టీవీ9), సాక్షి-3 (గ‌తంలో ఎన్టీవీ) వంటి చాన‌ళ్ల‌లోనూ ఆఫ్ ది రికార్డ్ స్టోరీలు చ‌క్క‌ర్లు కొట్టాయి. అయితే కార‌ణం మాత్రం తేల్చ‌లేక‌పోయాయి.
నాని మౌనం వీడ‌డం వెనుక పెద్ద మిస్ట‌రీ ఏమిలేద‌ని తేలిపోయింది. మంత్రి ప‌ద‌వి ఊడ‌బీక‌మంటావా? చ‌ంద్ర‌బాబుని తిడ‌తావా? అంటూ జ‌గ‌న్ గ‌ద్దించేస‌రికి ఇంక మంత్రి ప‌ద‌వి పోగొట్టుకోవ‌డం ఇష్టంలేక మీడియా ముందుకొచ్చి చంద్ర‌బాబుని నోటికొచ్చిన‌ట్టు తిట్టిపోయాడు . టీడీపీని వీడి జ‌గ‌న్ పంచ‌న చేరిన నుంచే చంద్ర‌బాబు ఆయ‌న కుటుంబ‌స‌భ్యుల‌ను అత్యంత దారుణంగా తిడుతూ కించ‌ప‌రుస్తూ సైకోలా ఆనందం పొందుతున్న కొడాలి నానికి జ‌గ‌న్ అధికారంలోకి రావ‌డంతోనే మంత్రి ప‌ద‌వి ఇచ్చారు. చ‌దువులేదు, జ్ఞానం లేదు, పాల‌న అంటే ఏంటో తెలియ‌దు కానీ మంత్రి ప‌ద‌వి ఇచ్చారు. ఎందుకంటే! కేవ‌లం చంద్ర‌బాబు ఆయ‌న కుటుంబ‌స‌భ్యులు, టీడీపీ నేత‌ల్ని దారుణంగా తిట్టాలి అనే ఒప్పందంతో పార్టీలో చేర్చుకున్న జ‌గ‌న్‌.. అదే కంపు నోటితో తిట్ట‌డ‌మే అర్హ‌త అని మంత్రి ప‌ద‌వి ఇచ్చారు. మంత్రి ప‌ద‌వి వ‌చ్చాక కొడాలి నాని ఇంకా బూతుల‌తో చెల‌రేగిపోయారు. అయితే సోష‌ల్ మీడియా, మీడియాని కొడాలి నాని ప‌ట్టించుకోక‌పోయినా ఆయ‌న పిల్ల‌లు క‌న‌క‌దుర్గ, విజ‌య‌దుర్గ‌లు, భార్య అనుప‌మ మాత్రం ఇవి ఫాలో అవుతున్నారు. తామెంత‌గానో ప్రేమించే తండ్రి ఇలా బూతులతో ట్రోల్ అవ్వ‌డం ఆ పిల్ల‌లు త‌ట్టుకోలేక‌పోయారు. చిన్న‌వ‌య‌స్సు అయిన‌ప్ప‌టికీ త‌మ చుట్టూ వున్న‌పిల్ల‌లు త‌మ తండ్రి గురించి అస‌హ్యంగా మాట్టాడుకోవ‌డం ఆ ఆడ‌పిల్ల‌ల మ‌న‌సులు బాధ‌ప‌డేలా చేశాయి. త‌మ‌ను ఎంత‌గానో ప్రేమించే తండ్రికి ఈ విష‌యం చెప్పి, ఇది మంచి ప‌ద్ధ‌తేనా? మ‌మ్మ‌ల్ని ఇలాగే ఎవ‌రైనా తిడితే ఊరుకుంటావా? అని నిల‌దీశారు. దీంతో ఏం చెప్పాలో తెలియ‌ని నాని మౌనం వ‌హించాడు. అలాగే గుడివాడ నియోజ‌క‌వ‌ర్గంలో నాని గెలుపు కోసం కీల‌కంగా ప‌నిచేసిన నేత‌లు కూడా ఇది చాలా న‌ష్టం చేస్తోంద‌ని హెచ్చ‌రించారు. జ‌న్మ‌తః మూర్ఖుడు కావ‌డం, లారీ క్లీన‌ర్‌గా జీవితాన్నిమొద‌లుపెట్టిన కొడాలి నాని ఇవేమీ ప‌ట్టించుకోలేదు. అయితే కుటుంబ‌స‌భ్యుల నుంచి తీవ్ర‌మైన ఒత్తిడి రావ‌డంతో కొన్నాళ్లు నోటికి ప‌ని చెప్ప‌కుండా మీడియాకి దూరంగా ఉండ‌టం ప్రారంభించాడు. కేవ‌లం చంద్ర‌బాబు, ఆయ‌న కుటుంబ‌స‌భ్యుల్ని తిట్టే ఒప్పందంతో పార్టీలో చేర్చుకుని మంత్రి ప‌ద‌వి క‌ట్ట‌బెడితే ఇంట్లో పోయి కూర్చుంటాడా? కొడాలి నాని గాడి మంత్రి ప‌ద‌వి పీకేసాన‌ని చెప్పందంటూ ఘాటూ హెచ్చ‌రిక‌లు పంపాడు జ‌గ‌న్ రెడ్డి. అంతేకాదు పౌర‌స‌ర‌ఫ‌రాల‌శాఖ స‌మీక్ష నీటిపారుద‌ల శాఖా మంత్రి అనిల్‌కుమార్ యాద‌వ్‌కి అప్ప‌గించారు. పౌర‌స‌ర‌ఫ‌రాల‌శాఖ ప్ర‌క‌ట‌న‌ల‌ను ర‌వాణాశాఖ మంత్రి పేర్నినానితో ఇప్పించారు. దీనిపై కొడాలి నాని అల‌కబూని పేర్నినాని ద‌గ్గ‌ర ల‌బోదిబోమ‌న్నాడు. త‌న కులాన్ని, బంధుత్వాల్ని, ఎన్టీఆర్ కుటుంబంతో అనుబంధాన్ని వ‌దులుకుని వ‌స్తే ఇంత‌లా అవ‌మానిస్తారా అని వాపోయాడు. దీనిపై పేర్నినాని స్పందిస్తూ, నీకు మంత్రి ప‌ద‌వి ఇచ్చింది నీవేదో హార్వ‌ర్డ్ యూనివ‌ర్సిటీ నుంచి చ‌దివి వ‌చ్చిన‌వాడ‌వ‌ని కాదు క‌దా! అలాగ‌ని ప‌రిపాల‌నాద‌క్షుడివి కూడా కాదు క‌దా! కేవ‌లం చంద్ర‌బాబు ఆయ‌న కుటుంబ‌స‌భ్యులు, టీడీపీ నేత‌ల్ని తిట్ట‌డానికి వారి కులం వాడినైన నిన్ను జ‌గ‌న్ గారు ఏరికోరి మ‌రీ తెచ్చుకున్నారు. టీడీపీ నేత‌ల్ని తిట్ట‌డ‌మే అర్హ‌త‌గా నీకు మంత్రి ప‌ద‌వి ఇచ్చారు. నువ్వు వారిని తిట్ట‌డం మానేసి ఇంట్లో కూర్చుంటే ఇంకెందుకు కొడాలి నానికి మంత్రి ప‌ద‌వి అని కోపమ‌య్యారు జ‌గ‌న్ గారు అని పేర్ని నాని వివ‌రించాడు . అయితే ఇప్పుడేం చేయాలి అని కొడాలి అడిగితే.. మ‌ళ్లీ రంగంలోకి దూకు, బూతులు అందుకో నీ మంత్రి ప‌ద‌వి సేఫ్ అని జ‌గ‌న్ త‌ర‌ఫున పేర్నినాని హామీ ఇచ్చాడు . వెనువెంట‌నే రంగంలోకి దిగిన కొడాలి నాని త‌న‌కు మాత్ర‌మే వ‌చ్చిన స‌భ్య‌స‌మాజం విన‌లేని బూతుల‌తో ప్రెస్ మీట్ పెట్టాడు. ఇదీ దీని వెనుక అస‌లు క‌థ‌.