జగన్ సంచలనం... ఆశల్లేవు, కరోనాను కట్టడి చేయలేం

August 05, 2020

ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి చేయని సంచలన కామెంట్స్ చేశారు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. కరోనాను కట్టడి చేయలేం అని... రాబోయే రోజుల్లో కరోనా, మనం కలిసి మెలసి జీవించాల్సిన పరిస్థితి తప్పదని అన్నారు. కరోనా నుంచి జనాల్ని కాపాడలేం కాబట్టి వారిని దానికి ప్రిపేర్ చేయాల్సిన అవసరం ఉందన్నట్టు జగన్ మాట్లాడటం ఆశ్చర్యకరం. ఆయన ప్రసంగం మొత్తం ఇదే కోణంలో సాగింది. 

​‘‘కరోనా రోగులను అంటరానివారిగా చూడొ​ద్దు. వారిపై వివక్ష చూపొ​ద్దు. ‘కరోనా’ వైరస్​ నాకూ రావచ్చు, మీకూ రావచ్చు, ఎవరికైనా రావచ్చు.​ జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుం​ది. పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు.​ పెద్ద వయస్కులు, బీపీ, షుగర్, ఆస్తమా ఉన్న వాళ్లపైనే ఈ వైరస్ కాస్తో​ ​కూస్తో ప్రభావం చూపిస్తుంది తప్ప, మిగిలిన వాళ్లపై ప్రభావం​ చూపలేదన్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ఆసుపత్రులకు రాకుండానే చాలా మందికి నయమయ్యే పరిస్థితి ఉం​ది. ‘కరోనా’ లక్షణాలు ఎవరికైనా ఉంటే వెంటనే తెలియజేస్తే వైద్యులు వచ్చి తగిన చికిత్స అందిస్తారని, వేరే వాళ్లకు సోకకుండా ఉంటుం​ది‘‘ అని జగన్  వివరించారు.

​అంటే ఏపీ ప్రజల్లో ఎవరికైనా రావచ్చు కాబట్టి ఎవరూ ఎవరినీ దూరంగా పెట్టొద్దు... ప్రతి ఒక్కరికీ రావడం ఖాయం... వచ్చినా భయం లేదు అన్నట్లు ముఖ్యమంత్రి చెప్పడం ఆందోళనకరంగా​ ఉంది. ఎందుకంటే... ఇమ్యునిటీ ఉన్న వాళ్లను ఏమీ చేయకపోవచ్చు గాని ఇమ్యునిటీ ఉన్న వారి ద్వారా ఇమ్యునిటీ లేని వారికి సోకితే ఎంత ప్రమాదం అన్నది ముఖ్యమంత్రి గుర్తించలేని పరిస్తితి. అస్తమా ఉన్నోళ్లకు, బీపీ సుగర్ ఉన్నోళ్లకు కాస్తో కూస్తో ప్రభావం చూపుతుందని చాలా తేలికగా తీసిపారేశారు జగన్. అసలు అస్తమా ఉన్న వారికి కరోనా సోకితే 90 శాతం బతుకు మీద ఆశ వదిలేసుకున్నట్టే అని ప్రపంచఘోషిస్తుంటే... ముఖ్యమంత్రి ఇంత తేలికగా తీసిపారేయడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. 

​ఒక్క నిమిషం ముఖ్యమంత్రి చెప్పిందే కరెక్టు అనుకుని కేవలం 10 శాతం మందికి దీని వల్ల ఇబ్బంది ఉంటుందనుకుందాం, ఒక శాతం మందికి ప్రాణాంతకం అనుకుందాం. 6 కోట్లు ఆంధ్రుల్లో 1 శాతం అంటే 6 లక్షల మంది. మరి ఆరు లక్షల మందికి ట్రీట్ చేసే సదుపాయాలు ఏపీలో ఉన్నాయా... దక్షిణ భారతదేశం మొత్తం మీద కూడా 6 లక్షల క్రిటికల్ కేసులకు ట్రీట్ చేసే సదుపాయం లేదు. మొత్తానికి ముఖ్యమంత్రి మాటలు చూస్తుంటే.... నిన్న ఎంపీ సంజీవ్ కుమార్ చెప్పినట్లు ఏపీ 4వ దశలోకి వెళ్లిపోయింది.