అసెంబ్లీ సాక్షిగా ఆర్థిక మంత్రి అజ్జానం !

December 06, 2019

ఇప్పటికి భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో వందలాది ప్రాజెక్టులకు వరల్డ్ బ్యాంకు ఫండ్ చేసింది. ప్రపంచంలోని అన్ని దేశాలు, అన్ని రాష్ట్రాలు అప్పులు తీసుకుంటాయి. కానీ ఈరోజు అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన ’’అధ్యక్షా అప్పులు ఇస్తే తీసుకోవడమేనా అధ్యక్షా, ఎవరు కడతారు అధ్యక్ష్యా అప్పులు, అవన్నీ ప్రజలు కట్టాలి కదా అధ్యక్ష్యా‘‘ అని మాట్లాడారు. ఇది అత్యంత ప్రమాదకరమైన స్టేట్ మెంట్.
బుగ్గనకు గుర్తుందో లేదో కొన్ని నెలల క్రితం... మాకు అప్పు తీసుకునే పరిమితి పెంచండి అంటూ అదే పనిగా కేసీఆర్ కేంద్రాన్ని కోరారు. అప్పు తీసుకుని ఉత్తమ మౌలికసదుపాయాలు కల్పిస్తే రాష్ట్రాలకు కొత్త పెట్టుబడులు వస్తాయి. కొత్త పెట్టుబడులు రావడం వల్ల ప్రభుత్వాలకు ఆదాయాలు పెరుగుతాయి. వనరులే లేనపుడు సంపద సృష్టి జరగదు. సంపద సృష్టించకపోతే యువతకు ఉపాధి, ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఎంతకాలం ప్రజలను ప్రభుత్వ పథకాలతో పోషించగలం. ప్రభుత్వాలు పేదలకు ఆసరాగా నిలవాలి గాని పోషించే పరిస్థితి రాకూడదు. ఇది జరగాలి అంటే ప్రజలకు పుష్కలంగా ఉపాధి దొరకాలి. ఉపాధి దొరకాలంటే కొత్త పరిశ్రమలు, పెట్టుబడులు రావాలి. దానికి సకల సదుపాయాలు ప్రభుత్వాలు కల్పించాలి. మరి అంత డబ్బు ప్రభుత్వం వద్ద ఉందా ? లేదు.
కేంద్రమైనా డబ్బు ఇవ్వాలి, లేదంటే అప్పు అయినా చేయాలి. ఈ మినిమమ్ కామన్ సెన్స్ లేక అప్పు ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు ఏపీ ఆర్థిక మంత్రి. అది కూడా అసెంబ్లీలో. కనీసం ఈ మాట అనే ముందు వైఎస్ హయాంలో చేసిన అప్పులను అయినా గమనించాలి, వాళ్ల మిత్రులు మోడీ, కేసీఆర్ లు చేసిన అప్పులు అయినా గమనించకుండా... చాన్సు దొరికితే చాలని చంద్రబాబును అనడానికి అని వాస్తవాలతో సంబంధం లేకుండా విమర్శలు చేసిన బుగ్గన గారు అడ్డంగా ప్రజలకు దొరికిపోయారు.