వస్తాదు జగన్... ఇదేనా నీ బలం? 

April 06, 2020

నాకు 20 సీట్లు ఇవ్వండి. కేంద్రం మెడలు వంచి గుద్దుతా అన్న వస్తాదు జగన్... నీ బలమంతా టీడీపీ కార్యకర్తమీద చూపడానికి సరిపోయిందా అంటూ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ నేత నారా లోకేష్ తీవ్రంగా మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం ప్రజలకు మంచి చేయదు. వారు పాలన చేయరు. పాలించడం రాదు. ఎవరైనా ప్రశ్నిస్తే జీర్ణించుకోలేరు. బడుగు బలహీన వర్గాలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తే జైల్లో వేస్తారా? ముసుగేసి మీడియా ముందు నిలబెడతారా? సిగ్గుందా మీకు అంటూ జగన్ పై విరుచుకుపడ్డారు లోకేష్.  

ఎస్... మీరు బీసీలకు అన్యాయం చేస్తున్నారు. మీరు అరెస్టు చేసిన విజయ్ పోస్టు చేసిన వీడియోనే నేను కూడా పోస్టు చేస్తున్నా? ఏం చేస్తారు? కేంద్రం మెడలు వంచగలిగిన మనిషి ఫేస్ బుక్ పోస్టులకు ఇంత భయపడటం ఏంటి? మీరు బీసీలకు, బడుగులకు అన్యాయం చేసింది నిజమే కదా. దానిని ప్రశ్నిస్తే మీకు నొప్పి ఎందుకు అని లోకేష్ నిలదీశారు.  ​పోలీసులు జాగ్రత్తగా ఉండాలి. ​జగన్ దగ్గర మార్కులు​ రావడం అటుంచితే తప్పుడు అరెస్టులు చేసి అన్యాయం కావొద్దు. తప్పులు చేసిన వారు కోర్టులు చుట్టు తిరుగుతున్నారు. జగన్ వద్ద మార్కులు కొట్టేయడానికి మీ జీవితాలను పణంగా పెట్టుకోవద్దు అంటూ లోకేష్ పోలీసులను హెచ్చరించారు.