WETA రధ సారథి  శ్రీమతి ఝాన్సీ రెడ్డి  జన్మదిన వేడుకలు 

December 08, 2019
 
ఈ రోజు ఉమెన్ ఎంప‌వ‌ర్ మెంట్ తెలుగు అసోసియేష‌న్‌(WETA)  రధ సారథి, NRI డా. అనుమాండ్ల రాజేందర్ రెడ్డి గారి సతీమణి శ్రీమతి ఝాన్సీ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా లయన్స్ సేవ తరుని డా. నాగవాణి ఆధ్వర్యంలో తొర్రూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో సామూహిక శ్రీమంతాలు కార్యక్రమం ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యులు గౌ. శ్రీ. ఎర్రబెల్లి దయాకర్ రావు గారి సతీమణి ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్ పర్సన్ ఉషా దయాకర్ రావు గారు హాజరై సుమారు 80 మంది గర్భిణి స్త్రీలకు పండ్లు, చీరెలు పంపిణీ చేసి, అనంతరం శ్రీమతి ఝాన్సీ రెడ్డి   గారి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది.
 
ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మంగళపెల్లి శ్రీనివాస్,  ఎంపీపీ టిసి అంజయ్య, డిప్యూటీ DMHO కోట చలం, డా. విక్రమ్ కుమార్, డా. కిరణ్ కుమార్, లయన్స్ ప్రతినిధులు, ఆశ కార్యకర్తలు, మహిళల, నాయకులు పాల్గొన్నారు.

 

Read Also

జాతీయ స్థాయిలో బజారున పడుతున్న జగన్ పరువు
వైసీపీలో వల్లభనేని వర్సెస్ దేవినేని?
జ‌గ‌న్ నీతి వాక్యాలకు శుభం కార్డు పడింది

RELATED ARTICLES

  • No related artciles found