బాబుని హీరో చేసేశావుగా జగన్...

June 03, 2020

ఫై ఫొటో ఈరోజు ట్విట్టరులో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ ఒక్క ఫొటోతో ఆంధ్రప్రదేశ్ కి బాబు చేసిందేంటో మాటలతో పనిలేకుండా అందరికీ అర్థమవుతోంది. నమ్ముకున్న నలుగురికి చంద్రబాబు ఏం దోచిపెట్టకపోవచ్చు గాని... భవిష్యత్తులో ప్రజలకు ఏం అవసరమో అది మాత్రం కచ్చితంగా చేసి తీరతాడు అంటూ పులువురు రకరకాలుగా కామెంట్లు చేస్తూ దీనిని షేర్ చేస్తున్నారు. చూసిన వారికి కూడా నిజమే కదా అని అనిపించేలా ఉందా కంపేరిజన్. 

ఇక మెడ్ టెక్ మీద... జగన్ ప్రకటించిన యుద్ధం... దానిని నాశనం చేయడానికి చేసిన ప్రయత్నాాలు కింద ఫొటోల్లో చూడొచ్చు

ఇపుడు మెడ్ టెక్ జోన్ వల్ల ఉపయోగం ఉందని తెలియగానే... ఆ క్రెడిట్ కొట్టేయడానికి వైసీపీ చేసిన ప్రయత్నం కింద చూడండి. ఇది వైసీపీ పార్టీ ట్టిట్టరు అక్కౌంట్లో వేసిన ట్వీటు

గత టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన మెడ్‌టెక్‌ జోన్‌కు నిధులిచ్చి సీఎం వైయస్ జగన్ గారు అందుబాటులోకి తెచ్చారు. జగన్ గారి ముందు చూపు వల్ల ఈ రోజు కరోనా టెస్టింగ్‌ కిట్లు, వెంటిలేటర్లు తయారు చేయగలిగాం. ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు కూడా కిట్లు సరఫరా అవుతాయి.

దటీజ్ జగన్... అర్థమవుతోందా?