అందరూ తెలుసుకోవాలి.. కరోనా వస్తే శరీరంలో ఏమవుతుంది?

August 08, 2020

మూడక్షరాల కరోనా అందరిని విపరీతంగా భయపెట్టేస్తుంది. మందు లేని ఈ వైరస్ ను కంట్రోల్ చేయటం కష్టమా? అంటే కాదనే చెప్పాలి. అలాంటప్పుడు ఇంత ఆగం ఎందుకంటే? దీనికున్న పరిమితులే కారణంగా. కంటికి కనిపించని ఈ అతిసూక్ష్మజీవి.. మానవాళికి ఇప్పుడు పెద్ద గండంగా మారింది. ఇప్పటికే వేలాదిమందిని బలి తీసుకున్న ఈ వైరస్ ఎలా వ్యాప్తిస్తుందన్న విషయంపై చాలానే కథనాలు వచ్చాయి.
అయితే.. కరోనా వైరస్ ఒంట్లోకి వచ్చాక ఏమవుతుంది? తర్వాతేం జరుగుతుంది? అన్న విషయాల మీద చాలామందిలో అవగాహన లేదనే చెప్పాలి. కరోనా వైరస్ ఒంట్లో చేరాక ఏమవుతుంది? తర్వాతేం జరుగుతుందన్న విషయాల్ని ప్రఖ్యాత మెడికల్ జర్నల్ లాన్సెట్ వెల్లడించింది. ఈ మీడియా సంస్థ అందించిన సమాచారాన్ని చూస్తే..
కరోనా (కోవిడ్ -19) వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత మినిమం ఐదు రోజులు మ్యాగ్జిమం పద్నాలు రోజుల్లోపు వ్యాధి లక్షణాలు బయట పడే అవకాశం ఉంటుంది. రోగ లక్షణాలు బయటకు రావటానికి సగటున ఐదు రోజులు పడుతుందని చైనాలో జరిపిన పరిశోధనల్లో తేలింది. అయితే.. వ్యక్తికి ఉండే రోగనిరోధక శక్తి.. వారి వయసు కరోనా లక్షణాలు బయటకు వెల్లడయ్యే అవకాశం ఉంటుందన్న మాటను నిపుణులు చెబుతున్నారు.
శరీరంలోకి కరోనా ఎంట్రీ ఇచ్చిన మొదటి మూడు రోజుల్లో (1-3) ఏమవుతుందంటే?
- మొదట్లో ముక్కు.. గొంతు ద్వారా శ్వాసకోశ సమస్యలు కనిపిస్తాయి
- మొదటి రోజుల్లోనే కొద్దిగా జ్వరం వస్తుంది
- మూడో రోజు నుంచి దగ్గు.. గొంతు నొప్పి మొదలవుతుంది
నాలుగు నుంచి తొమ్మిది (4-9) రోజుల్లో ఏమవుతుందంటే?
- వైరస్ మూడు నాలుగు రోజుల్లో ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది
- దీంతో.. ఊపిరి తీసుకోవటం కష్టమవుతుంది
- ‘8-9 రోజుల్లో ఊపిరితిత్తులు వాచి తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు షురూ అవుతాయి
ఎనిమిది నుంచి పదిహేను రోజుల్లో (8-15) ఏమవుతుంది?
- ఇన్ ఫెక్షన్ ఊపిరితిత్తుల నుంచి రక్తంలోకి చేరుతుంది
- వారం తిరిగేసరికి.. పరిస్థితి విషమిస్తుంది. ప్రాణాలకే ప్రమాదం స్థాయికి చేరుతుంది
పద్నాలుగు నుంచి ఇరవై ఒక్క (14-21)రోజుల్లో ఏమవుతుంది?
- కరోనా వైరస్ ఒక వ్యక్తి శరీరంలోకి చేరిన తర్వాత అత్యంత కీలకమైనది ఇప్పుడే
- 21 రోజుల తర్వాత బాధితుడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కావటమో.. అరుదుగా చనిపోవటమో జరుగుతుంది
-  మామూలుగా అయితే కరోనా లక్షణాలు ఉన్నట్లు తేలితే.. 18-25 రోజుల మధ్య వ్యాధి లక్షణాలు తగ్గి బాధితులుఇంటికి వెళ్లిపోతుంటారు.
- కరోనాలో నూటికి 95 మంది సురక్షితంగా బయటపడే వారే ఎక్కువ
- ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని వారు కరోనా నుంచి ప్రాణహాని తక్కువ. కానీ.. ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న వారు.. వయసు ఎక్కువగా ఉన్న వారిలోనే రిస్క్ ఎక్కువ.
- ఈ కారణంతోనే కేసులు భారీగా నమోదవుతున్నా.. మరణాల సంఖ్య తక్కువగా ఉండటానికి కారణం ఇదే.