ఇంట‌ర్నెట్‌ను ఊపేస్తున్న రాయ్‌ల‌క్ష్మి

December 14, 2019

ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా అభిమానులు పెరుగుతున్నారే గాని హిట్లు రావ‌డం లేదు రాయ్ ల‌క్ష్మీకి. అందుకే ఈసారి స‌రికొత్త లుక్‌తో, విభిన్న‌మైన‌ రొమాంటిక్ జాన‌ర్‌లో మ‌ళ్లీ మ‌న ముందుకు వ‌స్తోంది. ఐటమ్ సాంగ్స్ తో అదరగొట్టేస్తోన్న రాయ్ లక్ష్మి నాయిక ప్ర‌ధాన పాత్ర‌తో న‌డిచే ఈ క‌థ‌లో లీడ్ రోల్‌లో న‌టిస్తోంది. 'వేరీజ్ ద వెంకటలక్ష్మీ* టైటిల్‌తో వ‌స్తున్న ఈ సినిమా నుంచి తాజాగా ఒక లిరికల్ వీడియో సాంగ్ ను వదిలారు. అది అంద‌రినీ ఆక‌ట్టుకుంది. 

" సమంతకి దిమ్మదిరిగే సొగసురా .. తమన్నాకి కళ్లు తిరిగే తళుకురా .. అనుపమ .. మెహరీన్ .. హన్సిక .. అదిరిపడే అందగత్తెరా .." అంటూ సాగే ఈ పాట ఇపుడు యుట్యూబ్ ట్రెండ్స్‌లో ఉంది.  ఇదీ ఆ పాట‌. మీరూ చూసి విని ఆనందించండి.