సంచలనం: జీవితంపై ఆశ పోగొట్టిన WHO  ?

August 14, 2020

మార్చి తొలివారంలో మనదేశంలో అత్యధికులకు అసలు కరోనా గురించి ఆలోచనే లేదు. ఆ మాటకు వస్తే ప్రభుత్వం కూడా పెద్ద కేర్ చేయలేదు. మార్చి మూడో వారంలోకి ఎంటరవగానే చాలా వేగంగా కరోనా యెక్క భయంకరమైన ప్రభావం మనకు అర్థమైపోయింది. అప్పటికపుడు దేశం అలర్ట్ అయ్యింది. అంతర్జాతీయ, దేశీయ విమానాలు ఆపేసింది. రైళ్లు మెల్లగా ఆపేసింది. దురదృష్టవశాత్తూ అప్పటికే మర్కజ్ సదస్సుతో దేశమంతటికీ వైరస్ వ్యాపించేసింది. మర్కజ్ వారిలో బయటపడింది మార్చి 29వ తేదీ తర్వాతే అయినా... 17-18 తేదీల నాటికే అన్ని రాష్ట్రాల్లో ఇది గుంభనంగా ఉంది. ప్రభుత్వాలు ఎంతసేపూ ఎన్నారైల మీద తప్ప స్వదేశంలో జరుగుతున్న వారి మీద దృష్టిపెట్టలేదు. ఎన్నారైలను క్వారంటైన్ లో ఉండాలని చెప్పిన కేంద్రం విదేశీ టూరిస్టులను తన వద్ద క్వారంటైన్ లో ఉంచుకోకుండా వదలడం కూడా ఇపుడు పెద్ద ముప్పును తెచ్చిపెట్టింది. 

 

అయ్యిందేదో అయ్యింది. దాదాపు అన్ని కేసులను పట్టేశాం అనుకుంటున్న సమయంలో పుట్టలు పగిలినట్లు పగులుతూనే ఉన్నాయి. పరిస్థితి అదుపులోనే ఉన్నట్టుంది కానీ... కొత్త ఇంతవరకు అనుమానించని ప్రాంతాల్లో మనుషుల్లో కొత్త కేసులు బయటపడుతున్నాయి. దీంతో ఇప్పటికే ప్రభుత్వాలకు చలి జ్వరం వచ్చింది. ఇవన్నీ చాలవన్నట్టు తాజాగా WHO చేసిన ప్రకటన జీవితం మీద ఆశను పోగొట్టేసింది. ఒకవైపు ఈ వైరస్ ను ముందే అంచనా వేసిన బుల్లి జ్యోతిష్యుడు అభిగ్య చెప్పిన దానితో పోలేలా ఉంది WHO ప్రకటన. వచ్చే ఏడాది వరకు దేశానికి ఇబ్బందులు తప్పవు అని అభిగ్య చెప్పాడు. తాజాగా డబ్లు హెచ్ వో కూడా అటుఇటుగా అదే చెప్పింది. వ్యాక్సిన్ వచ్చే వరకు కరోనాతో ముప్పు తప్పదు అని బాంబు పేల్చింది. ఈ విషయం దాని అధికార ప్రతినిధి డేవిడ్ నాబర్రో ప్రకటించారు. దీనికి వ్యాక్సిన్ కనిపెట్టినపుడే మనకు శాంతి, భద్రత. అప్పటివరకు ఇది వెంటాడుతూనే ఉంటుందని ఆయన సంచలన ప్రకటన చేశారు. అంటే రేపో మాపో లేకపోతే ఏప్రిల్ 30న అయితే గ్యారంటీగా లాక్ డౌన్ తీస్తేస్తారు.. ఇంకేం మనపని మనం చూసుకోవచ్చు అని ఎక్కువరోజులు ఉండదు దీని ప్రభావం అనుకున్న మనల్ని హతాశుల్ని చేసింది ఈ ప్రకటన. 

అన్ని దేశాలు మరికొన్ని రోజుల్లో ఇది అంతం అవుతుందని వేసిన అంచనాలన్నీ తలకిందులు అవుతాయట. అంతేకాదు కొన్ని రోజుల క్రితం లాక్ డౌన్ వేసినంత మాత్రాన పెద్ద ఉపయోగం లేదని చెప్పిన డబ్ల్యు హెచ్ వో తాజాగా లాక్ డౌన్ తీసేయాలన్న చర్చ జరుపుతుంటే ఇంకోసారి ఆలోచించుకోండి అంటోంది. అంటే ఎపుడు అంతం అవుతుందన్నది ఎవరూ చెప్పలేని పరిస్థితుల్లో మన భవిష్యత్తు ఏంటో అర్థం కాని పరిస్థితి.

అయితే ఇక్కడ ఇంకో ప్రధాన విషయం కూడా చర్చించాలి. డబ్లుహెచ్ వో కరోనా విషయంలో పూర్తి ఫెయిలందన్న వాదన బాగా ఉంది. దానికే సరైన అవగాహన లేదని ఆ మాటకొస్తే డబ్లుహెచ్ వో కంటే ఆయా దేశాల ప్రభుత్వాలకే కరోనా గురించి లోతైన విషయాలు తెలుస్తున్నాయని... అందువల్ల డబ్లు హెచ్ వో మాటను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న వాదనా వినిపిస్తోంది.