APPSC ప్రశ్నాపత్రం లీక్ వెనుక ఉన్న సూత్రధారి ఎవరు ?

April 03, 2020

18 లక్షలమంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడి, గ్రామ సచివాలయ ఉద్యోగులును ఎంపిక చేయడానికి నిర్దేశించిన ప్రశ్నాపత్రాన్ని లీక్ చేసి, తమ వారికి ఆ ప్రశ్నపత్రాన్ని అందించి, తద్వారా వారికి ర్యాంకులు, ఉద్యోగాలు రాబట్టిన దుర్మార్గపు కుట్రకి సూత్రధారి వైసిపి సోషల్ మీడియాలో ప్రముఖుడిగా చలామణీ అవుతున్న అవుతు శ్రీధర్ రెడ్డి. APPSC కార్యాలయంలో టైపిస్టుగా పని చేస్తున్న అనితారెడ్డి భర్త శ్రీనివాస రెడ్డి, అవుతు శ్రీధర్ రెడ్డికి సన్నిహుతుడు.


జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన రోజునుండి, అవుతు శ్రీధర్ రెడ్డి వెలగపూడి సచివాలయం చుట్టూ చక్కర్లు కొడుతున్నాడనే విషయం వైసిపి ముఖ్యనాయకులందరికి తెలిసిందే. తనకు జగన్మోహన్ రెడ్డి చాలా సన్నిహితుడని, సోషల్ మీడియాలో తాను ఎంతో కష్టపడి ప్రచారం చేయడంవల్లనే తెలుగుదేశం ప్రభుత్వంపట్ల వ్యతిరేకత వచ్చిందని, వైఇపి విజయంలో తన వాటా చాలా పెద్దదని, అందుకే తనకు పెద్ద లాభం చేకూరుస్తామని వైసిపి పెద్దలు మాట ఇచ్చారని అవుతు శ్రీధర్ రెడ్డి అనేక సందర్భాల్లో తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించాడని వారు చెబుతున్నారు. గత వందరోజులుగా ప్రభుత్వోద్యోగిగా పని చేస్తున్న తన భార్య బదిలీ విషయంపై తిరుగుతున్నట్లుగా నటిస్తూ శ్రీధర్ రెడ్డి రోజూ సెక్రటేరియట్ చుట్టూ చక్కర్లు కొడుతూ కలెక్షన్ కౌంటర్ తెరిచాడని వినికిడి.


ఫైల్స్ ఉంటే తెచ్చుకోమని తనకు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి స్వయంగా చెప్పారని అమాయకులను నమ్మిస్తూ, బిల్లులు మంజూరు చేయిస్తానని కొందరు కాంట్రాక్టర్లను మభ్యపెట్టి వసూళ్ళు చేశాడని వైసిపి సర్కిల్స్‌లో బలంగా వినిపిస్తున్నది. అన్ని జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు తాను చెప్పినట్లే వింటారని, గ్రామ వలంటీరు ఉద్యోగాల్లో తనకు ప్రత్యేక కోటా ఉందని నమ్మబలికి అనేకమంది అమాయక నిరుద్యోగుల దగ్గర డబ్బులు వసూలు చేశాడని బాధితులు వాపోతున్నారు. ఇతని వసూళ్ళ విషయం ఆర్ధికమంత్రి చెవిన పడడంతో తన పేషీ చుట్టుపక్కల అవుతు శ్రీధర్ రెడ్డిని అనుమతించవద్దని మంత్రిగారు ఆదేశాలు జారీ చేశారట. అలాగే ఇతగాడు తన పేరు వాడుతున్న వైనం తెలుసుకున్న మంత్రి పెద్దిరెడ్డిగారు ఆగ్రహం వ్యక్తం చేశారని, అవుతు శ్రీధర్ రెడ్డి తన భార్యకు జరిగిన నంద్యాల బదిలీని మార్చమని ఎంత విజ్ఞప్తి చేసినా ససేమిరా నిరాకరించాని మంత్రి పేషీలో వార్తలు వినబడుతున్నయి.


ఇక గ్రామ సచివాలయ పోస్టులు ఇప్పిస్తానని శ్రీధర్ రెడ్డి దాదాపు రెండువందలమంది ఆశావహులు ఒక్కొక్కరి దగ్గర నాలుగు లక్షలు బేరం కుదుర్చుకున్నాడని తెలియవస్తున్నది. వీటిలో పరీక్ష జరగడానికి ముందుగా అభ్యర్ధికి రెండులక్షలు కట్టేట్లుగా, నియామకం ముందు మిగతా రెండులక్షలు చెల్లించేట్లుగా బేరం కుదిరింది. ఇందులో తనకు మిగిలేది కేవలం లక్ష మాత్రమేనని, మంత్రికి రెండు లక్షలు, అధికారులకు లక్ష చెల్లించాల్సి ఉందని అభ్యర్ధులతో చెప్పాడట. ఈ కుట్రలో భాగంగా, తన సన్నిహితుడైన శ్రీనివాస రెడ్డి భార్య అనితారెడ్డితో గ్రామసచివాలయ పోటీపరీక్షకి సంబంధించిన ప్రశ్నాపత్రం కాపీని సంపాదించి, ఆ కాపీల్ని తాను డబ్బులు వసూలు చేసిన రెండువందలమంది అభ్యర్ధులకు అందజేశాడని నిఘావర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం అవుతు శ్రీధర్ రెడ్డిని పోలీసులు రహస్యంగా విచారిస్తున్నారని తెలుస్తున్నది. అవుతు శ్రీధర్ రెడ్డి వసూళ్ళ దందాలో బాధితులంతా అతని సామాజికవర్గానికి చెందినవారే అవడం మొత్తం కుట్రలో కొసమెరుపు.

 

RELATED ARTICLES

  • No related artciles found