ఎస్వీబీసీ చానల్ బాధ్యతలు ఆ దర్శకుడికా?

July 15, 2020

కీలక స్థానాల్లో ఉండే వారికి పదవి తీసుకొచ్చే గ్లామర్ తో పాటు.. కొన్ని మాయలు.. ఉచ్చులు రెఢీగా ఉంటాయి. ఇలాంటి వాటిని గుర్తించి.. అందులో పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ.. అలాంటి విషయాల్లో దొర్లే తప్పులు ఎంత డ్యామేజ్ చేస్తాయన్న విషయం తాజాగా థర్టీ ఇయర్స్ పృథ్వి రాజ్ ను చూస్తే ఇట్టే అర్థమవుతుంది. బయటకు వచ్చిన ఆడియో తనది కాదని.. తన గొంతుతో అలా చేశారని చెబుతున్న మాటలో వాస్తవం ఏమిటన్నది విచారణ తేల్చాలి.
మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను చూస్తే.. తాను పవర్లోకి వచ్చిన తర్వాత కరకుగా ఉండటమే కాదు.. ఎవరైనా తప్పు చేసినట్లుగా ఆరోపణలు వచ్చినా ఉపేక్షించటం లేదు. పారదర్శకతతో పాటు.. ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే పని అస్సలు చేయొద్దన్న సంకేతాల్ని తరచూ ఇస్తున్నారు. ఇలాంటివేళలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
కానీ.. పృథ్వి రాజ్ ప్రదర్శించిన నిర్లక్ష్యం.. కీలకమైన స్థానాన్ని కోల్పోయేలా చేసింది. ఆయన రాజీనామాతో ఖాళీ అయిన ఎస్వీబీసీ ఛైర్మన్ పదవి.. ఇప్పుడు ఎవరు చేపడతారన్నది ప్రశ్నగా మారింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈసారి కూడా ఎస్వీబీసీ చానల్ పగ్గాలు సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తికే దక్కుతాయని చెబుతున్నారు. దివంగత మహానేత వైఎస్ కు అత్యంత సన్నిహితంగా ఉన్న సినీ దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి పేరు వినిపిస్తోంది.
ఢమరుకం.. కుబేరులు.. టాటా బిర్లా మధ్యలో లైలా.. రాగల 24 గంటలు వంటి చిత్రాల్ని తీసిన ఆయనకే ఎస్వీబీసీ చానల్ పగ్గాలు అప్పజెబుతారని చెబుతున్నారు. ఒకవేళ.. అదే జరిగితే.. సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తికే ఎస్వీబీసీ చానల్ పగ్గాలు దక్కటం విశేషంగా చెప్పక తప్పదు. 

Read Also

మహేష్ దమ్మెంతో చూడాలిప్పుడు..
కష్టపడి పని చేశాక.. పార్టీ ఎంతగా చేసుకోవాలో చెప్పేసింది
రాజ్యమేలుతున్నది జగన్ కాదు అరాచకం