కరోనా : ఇంతవరకు వచ్చిన అతిపెద్ద బ్యాడ్ న్యూస్ ఇదే

August 11, 2020

ఆర్థిక వ్యవస్థలను సమతుల్యం చేయడానికి లాక్ డౌన్ లో సడలింపులు తప్పడం లేదు. దీంతో ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మళ్లీ మళ్లీ బయటపడుతోంది. దీంతో WHO ఒక సంచలన ప్రకటన చేసింది. అయితే COVID-19 చాలా కాలం పాటు ఉండవచ్చని ప్రపంచ ఆరోగ్య అధికారి ఒకరు బుధవారం హెచ్చరించారు. వ్యాక్సిన్ రాకపోతే ఇది ఎయిడ్స్ లాగే సమాజంలో అలాగే ఉండిపోతుందన్నారు.

ఈ ప్రకటన అన్ని దేశాలను ఆందోళనకు గురిచేసింది. పైగా వ్యాక్సిన్ కనిపెట్టినా.... 700 కోట్ల మందికి వ్యాక్సిన్ వేయడానికి చాలా సమయం పడుతుందని WHO పేర్కొంది.
గత ఏడాది చివర్లో మొదట మహమ్మారి ప్రారంభమైన చైనా నగరమైన వుహాన్ అధికారులు లాక్ డౌన్ ప్రకటించారు. చాలాకాలం తర్వాత కేసుల్లేవని దానిని ఎత్తేశారు. దీంతో మళ్లీ కేసులు వచ్చాయి. చివరకు చైనా ఒక నిర్ణయం తీసుకుంది. రాబోయే 10 రోజుల్లో వుహాన్ లోని 11 మిలియన్ల మందికి పరీక్షలు నిర్వహించాలని డిసైడ్ అయ్యింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క ఉన్నత అధికారి డాక్టర్ మైఖేల్ ర్యాన్ బుధవారం ఒక విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ  "ఈ వైరస్ ఎప్పటికీ పోదు" అన్నారు. టీకా లేకుండా, ప్రపంచ జనాభా తగినంత స్థాయిలో రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి సంవత్సరాలు పట్టవచ్చని ఆయన అన్నారు.
సడలింపులు వ్యాధి వ్యాప్తికి దారితీసే ప్రమాదం ఉన్నప్పటికీ, యూరోపియన్ దేశాలు సరిహద్దు ప్రయాణాలను తిరిగి ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నాయి. లెబనాన్ లో ఎత్తేసిన లాక్ డౌన్ మళ్లీ పెట్టారు.  ఈ సందర్భంగా వచ్చిన కేసుల్లో వారికి అర్థమైంది ఏంటంటే... భౌతిక దూరం, మాస్కులు, శుభ్రత ప్రజలు పట్టించుకోవడం లేదని, అందువల్లే మళ్లీ కేసులు పెరిగాయని కనుగొన్నారు.

యూరోపియన్ యూనియన్ సంచలన నిర్ణయం తీసుకోబోతోంది. తన 27 దేశాలలో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి తీవ్రంగా దెబ్బతిన్న పర్యాటక పరిశ్రమను ఓపెన్ చేయాలని భావిస్తోంది. దీనిపట్ల who ఆందోళన వ్యక్తంచేస్తోంది. E.U. యొక్క ఎగ్జిక్యూటివ్ ఆర్మ్, యూరోపియన్ కమిషన్, మూసివేసిన సరిహద్దుల తనిఖీలను ఎత్తివేయడం, విమానయాన సంస్థలు, ఫెర్రీలు మరియు బస్సులను నడుపుటకు అవసరమైన సలహాలు, గైడ్ లైన్స్ రూపొందిస్తోంది. 

తీవ్రమైన ఆర్థిక పతనానికి అడ్డుకట్టవేయడపై అన్ని దేశాలు దృష్టిపెట్టాయి. దీంతో పాటు ప్రజల భద్రతపై దృష్టిపెట్టాయి.  జర్మనీతో సరిహద్దు జూన్ 15 న పూర్తిగా తెరవబడుతుందని, శుక్రవారం నుంచి సరిహద్దు తనిఖీలను తగ్గిస్తామని ఆస్ట్రియా తెలిపింది.  ఇటలీ గత వారం లాక్డౌన్ పరిమితులను పాక్షికంగా ఎత్తివేసింది. 

ఇదిలా ఉంటే.. మన దాయాది పాకిస్తాన్ ఆంక్షలు సడలించడంతో స్థానిక మార్కెట్లలోకి జనం తరలిరావడంతో పాకిస్తాన్ ఒకే రోజులో 2 వేల కొత్త కేసులు బయటపడ్డాయి. వచ్చే వారం బెల్జియంలో సెలూన్లు, స్కూళ్లు వంటివి తెరిచారు. పోర్చుగల్ పాఠశాలలు తెరిచింది.