విశాలో చీలిన ఓట్లు....న‌ష్టం ఎవ‌రికో..?

July 21, 2019

విశాఖ‌ప‌ట్నం ఇది ఎప్పుడు హాట్ సీటే. ఏపీకి అమ‌రావ‌తి రాజ‌ధాని అయిన‌ప్ప‌టికి విశాఖ‌ను అన‌ధికార రాజ‌ధానిగా అంద‌రూ భావిస్తారు. అందుకే రాజ‌కీయంగా ఇది అంద‌రికి ప్ర‌తిష్టాత్మ‌క‌మే. విశాఖప‌ట్నం పార్ల‌మెంట్ లో జ‌రిగిన పోలింగ్ స‌ర‌ళి టీడీపీ, వైసీపీ, బీజేపీని భ‌య‌పెడుతుంద‌ట‌. ఓటు బ్యాంకు చీలిపోవ‌డం వ‌ల్ల అది ఎవ‌రిపై ప్ర‌భావం చూసిస్తోంద‌న‌ని ఆందోళ‌న నెల‌కొంది. బీజేపీ సిట్టింగ్ సీటు కావ‌డంతో పార్టీ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. వైసీపీ, టీడీపీ కూడా ఇక్క‌డ పాగా వేసేందుకు స‌ర్వ‌శ‌క్తుల‌ను ఒడ్డింది. అయితే జ‌న‌సేన చివ‌రి నిమిషంలో సీబీఐ మాజీ జాయింట్ డైరెక్ట‌ర్ ల‌క్ష్మీనారాయ‌ణ‌ను బ‌రిలో దింప‌డం వారి ఆందోళ‌న‌కు కార‌ణంగా మారింది. జేడీ అనూహ్యంగా విశాఖ బరిలో నిలవడం, అదీ జనసేన నుంచి పోటీ చేయడంతో ఈ కాంబినేషన్ ఎంతవర కు వర్కౌట్ అయిందన్న దాని మీద హాట్ డిస్కషన్స్ జరుగుతున్నాయి.పోలింగ్ సరళిని బట్టి చూస్తే జేడీ బాగానే ఓట్లను కొల్లగొట్టారని అంటున్నారు. అర్బన్ ఓటర్లు ఆయన ఇమేజ్ ని చూసి ఓట్లు వేస్తే, యువత పవన్ మ్యానియాతో అయన వైపు మొగ్గారని అంటున్నారు.

ఇక ఉత్తరాది జనాభా ఓట్లను కూడా ఆయన బాగానే లాగేశారని తెలుస్తోంది విద్యావంతులు, మెధావులు ఎక్కువగా ఉండే విశాఖలో జేడీ పోటీ చేయడం అనే వ్యూహం బాగా సక్సెస్ అయిందని అంటున్నారు అదే విధంగా బలమైన కాపు సామజిక వర్గం కూడా జేడీ కోసం చమటోడ్చిందని చెబుతున్నారు. జేడీ రేసులో బలంగా ఉన్నారని తేలడంతో ఏ పార్టీ ఓట్లకు గండి పడిందన్న చర్చ కూడా వెంటనే వస్తోంది. ఈ త‌రుణంలో విజ‌యం పై భ‌రోసా పెట్టుకున్న టీడీపీ, వైసీపీలో బెంగ పెట్టుకున్నాయి. ఒక వేళ క్రాస్ ఓటింగ్ జ‌రిగి ఉంటే మూడో పార్టీ గెలిచినా ఆశ్చ‌ర్యం లేద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. అంతే కాదు టీడీపీ త‌ర‌ఫున బాల‌య్య త‌న చిన్న అల్లుడిని బ‌రిలో దింపాడు. బీజేపీ పురందేశ్వ‌రిని పోటీకి నిలిపింది. ఇద్ద‌రు ఒక‌టే క‌మ్యునిటీకి చెందిన వారు కావ‌డంతో పాటు ఓ వ‌ర్గం ఓటు చీలిపోయే ప్ర‌మాదం లేక‌పోలేద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఓ వైపు జ‌న‌సేన మ‌రో వైపు బీజేపీ కార‌ణంగా టీడీపీ ఆందోళ‌న చెందుతుంది. జేడీ, పురందేశ్వ‌రి ఓట్లు చీలిచితే అది త‌మ‌కే న‌ష్టం అని టీడీపీ లెక్క‌లు వేస్తోంది. ఎన్ని ఓట్లు చీలినా టీడీపీ విజ‌యం సాధిస్తుంద‌నే ధీమా వ్య‌క్తం చేస్తోంది. ఈ చీలిక‌ల్లో త‌మ‌కు మేలు జ‌రుగుతుంద‌ని వైసీపీ భావిస్తోంది. ల‌క్ష్మీనారాయ‌ణ బ‌రి దిగ‌డంతో విశాఖ పై రాష్ట్రమంతా హాట్ చ‌ర్చ సాగుతుందంటే అతిశ‌యెక్తి కాదు.