మమతా బెనర్జీ భారతదేశపు 15వ ప్రధాని !!!

November 19, 2019

21 వ శతాబ్దంలో అంటే 2000 ఏడాది తర్వాత నుంచి భారతదేశంలో ప్రాంతీయ పార్టీలు బలపడుతూ వచ్చాయి. అయితే అనేక కూటముల తర్వాత ప్రజలు కొంచెం విసిగి పోయారు. దీంతో ఫైనల్ గా ఒక్కసారి చూద్దాం... సింగిల్ పార్టీ ప్రధానిని గెలిపిద్దాం అని భావించారు. అదే సమయంలో మోడీ రూపంలో ఈ దేశంలో అతిపెద్ద సంఖ్యలో ఉన్న హిందువుల తమ మనసులో వేరే ఉద్దేశం పెట్టుకుని మోడీకి ఓటేయగా, ఆలోచనా పరులు అవినీతి తరిమేసేందుకు ఓటేశారు. దీంతో సంపూర్ణ మెజారిటీతో నరేంద్ర మోడీ ప్రధాని అయ్యారు. 

ప్రజలు వాస్తవానికి రిస్క్ చేశారు. మంచిని కోరి రిస్క్ చేశారు. దానిని మోడీ ఎంత దుర్వినియోగం చేశారంటే... ప్రజల కలలు నెరవేరకపోగా దేశం తిరోగమనం చెందింది. మోడీ ప్రధాని కావడం అనేది ప్రతి కుటుంబం మీద ఆర్థిక ప్రభావం నేరుగా చూపింది. మన గ్యాస్ బిల్లు పెరిగింది. మన పెట్రోలు బిల్లు పెరిగింది. మన కేబుల్ బిల్లు పెరిగింది. ప్రతి ఇంటికి ఇవి నిత్యావసరాలు... మోడీ అసమర్థత వల్ల ఇవన్నీ చాలా దారుణంగా నష్టపోయాం. ఇక దేశానికి పనికొచ్చే నిర్ణయాల గురించి మాట్లాడుకోకపోవడమే మంచిది. అందుకే భారతీయులు సమీప భవిష్యత్తులో సింగిల్ పార్టీకి ఇక పట్టం కట్టరు. 

కూటమిలో వచ్చే గొడవల వల్ల ఆ పార్టీలకు నష్టం గానీ దేశానికి కాదు. అందరికీ భయం ఉంటుంది. కార్పొరేట్లు దేశాన్ని శాసించడం తగ్గుతుంది. అన్ని పార్టీలు ఒళ్లు దగ్గరపెట్టుకుని పనిచేస్తాయి. అందుకే దేశంలో రాబోయే ప్రభుత్వం హంగ్ ప్రభుత్వం. సరే హంగ్ వస్తే ప్రధాని మమతా బెనర్జీ అవుతుందని మీరు ఎలా చెబుతారు? అనేదేగా మీ అనుమానం. ఎలా అంటే ప్రస్తుతం దేశంలోన్ని అన్ని జాతీయ పార్టీల కన్నా చాలా స్ట్రాంగ్ గా ఉన్న పార్టీ మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్. 42 సీట్లు ఉన్న పశ్చిమ బెంగాల్ల ో ఆమెకు 35 సీట్ల కంటే ఎక్కువ రానున్నాయి. ఇది ఎంత పెద్ద సంఖ్య తెలుసా.... దేశంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల తర్వాత మూడో అతిపెద్ద పార్టీగా మమత బెనర్జీ పార్టీ తృణమూల్ ఉంటుంది. ఆ తర్వాతే బీఎస్పీ అయినా, ఎస్పీ అయినా, పట్నాయక్ పార్టీ అయినా ఉంటాయి. హంగ్ ప్రభుత్వం వచ్చినపుడు 200 సీట్లు పైన వస్తేనే బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు ప్రధాని పదవి దక్కుతుంది. కానీ ఆ రెండు పార్టీలకు ఆ అవకాశం లేదు. ఈ నేపథ్యంలో మద్దతు పలికే పెద్ద పార్టీలకు అవకాశం వస్తుంది. మరి ఆ అవకాశం మూడో పెద్ద పార్టీ అయిన మమత పార్టీకే ఉంటుంది. అందుకే చంద్రబాబు మమతా బెనర్జీకి అంత ప్రాధాన్యం ఇస్తున్నారు. 

ఒకసారి ఎక్కువ సీట్లు సాధించే అవకాశం ఉన్న పార్టీలను  చూద్దాం.

టీఎంసీ - 35 సీట్లు వస్తాయి

బీఎస్పీ  - 20 సీట్లకు మించి రావు

ఎస్పీ - 25 సీట్లకు మించి రావు

బిజూ జనతాదళ్ - 16 సీట్లకు మించి రావు

టీఆర్ఎస్ - 12 సీట్లకు మించి రావు

వైసీపీ - 10-15  సీట్లకు మించి రావు

టీడీపీ - 10 -18 సీట్లకు మించి రావు

శివసేన - 12 సీట్లకు మించి రావు

జేడీఎస్ - 10 సీట్లకు మించి రావు

ఎన్సీపీ - 14 సీట్లకు మించి రావు

డీఎంకే - 25 సీట్లకు మించి రావు

అంటే మిగతా పార్టీలు ఏవీ కూడా మమత అన్ని సీట్లు సాధించలేని పరిస్థితి ఉంది. ఈ నేథ్యంలో హంగ్ వస్తే కేంద్రంలో మమత ఏం చెబితే అది చెల్లుబాటు అవుతుంది. అందుకే 15వ ప్రధాని అయ్యే అవకాశాలు ఆమెకు పుష్కలంగా ఉన్నాయి.  ఒకవేళ ఆమె ప్రధాని ఉండాలని కోరుకోకపోతే ఆమె నిర్ణయించిన వాళ్లు ప్రధాని అవుతారు. 

నోట్ - పైన పేర్కొన్న అంకెలు ఆ పార్టీలు మ్యాగ్జిమ్ గెలుచుకునే అవకాశం ఉన్న సీట్లే గాని కచ్చితంగా గెలిచే అంకె అని కాదు. ఒక్క మమతకు మాత్రమే 30 కి ఒక్కటి కూడా తగ్గవు.