అభినందన్ కు ఘన స్వాగతం పలుకుతున్న యావత్తు భారత్..

July 08, 2020

ఇప్పుడు యావత్తు భారతదేశం అంతా ఒక సైనికుని రాక కోసం ఎంతగానో ఎదురు చూస్తుంది.పుల్వామా దాడుల నేపథ్యంలో పాకిస్థాన్ మరియు మన దేశాల మధ్య జరిగిన వైమానిక దాడుల మధ్య మన దేశానికి చెందిన అభినందన్ వర్థమాన్ అనే వైమానిక దళ కమాండర్ మొన్న పాక్ సైన్యానికి చిక్కారు.దీనితో ఆయన్ని ఏమన్నా చేస్తారేమో అని చాలా మందే ఖంగారుపడ్డారు.కానీ అభినందన్ రక్తం చిందుతున్నా సరే చెరగని చిరునవ్వు కనబర్చడంతో ప్రతీ ఒక్క భారతీయుడు గర్వపడ్డాడు.

అంతే కాకుండా జెనీవా ఒప్పందం ప్రకారం అభినందన్ ను సేఫ్ గా అప్పగించాలని భారత్ ప్రభుత్వంతో పాటు ప్రతీ భారతీయుడు డిమాండ్ చెయ్యగా పాకిస్థాన్ ప్రభుత్వం చేసేది ఏమి లేక దిగాల్సొచ్చి బేషరతుగా అభినందన్ ను స్వదేశానికి పంపేందుకు ఒప్పుకున్నారు.నిన్ననే పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వారి పార్లమెంటులో అభినందన్ ను పంపేందుకు ఒప్పుకున్నారు.ఈ రోజు పంపుతామని అధికారికంగా చెప్పేసారు.దీనితో ఈ రోజు అభినందన్ కు ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు.చాలా చోట్ల ఇప్పటికే అభినందన్ వస్తున్నారని సంబరాలు చేసుకుంటుండగా పలువురు సినీ ప్రముఖులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.