`బ్లాక్ లేబుల్` బ్యాచ్ కు మోడీ అంటే కోపమెందుకంటే

August 14, 2020

2014 లో భారత ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మనదేశంలో మీడియా స్వేచ్ఛ లేదంటూ కొన్ని మీడియా సంస్థలు, మీడియా సంస్థల అధిపతులు కొందరు ఆరోపణలు చేస్తున్నారు. కొన్ని మీడియా సంస్థలు మోడీకి వంతపాడుతున్నాయని, మిగతా మీడియా సంస్థల నోళ్లను మోడీ నొక్కేశారని కొందరు ఆరోపణలు చేస్తున్నారు. తనకు వ్యతిరేకంగా రాసే వారిపై మోడీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని...ఓ వర్గం వారు ఎన్డీఏ ప్రభుత్వంపై, ప్రధాని మోడీపై దుష్ప్రచారం చేస్తున్నారు. విదేశీ పర్యటనల కోసం మోడీ వేల కోట్లు దుబారా చేస్తున్నారని ఎందుకు ఆరోపిస్తున్నారు? రాజ్ దీప్ సర్దేశాయ్, బర్ఖా దత్, రావీష్ కుమార్ వంటి వారు....ప్రధాని మోడీపై ఎందుకు విమర్శలు గుప్పిస్తున్నారు....మిగతా మీడియ ా సంస్థలకు లేని ఇబ్బంది కొన్ని మీడియా సంస్థలకు మాత్రం ఎందుకు ఉంటోంది అన్న సందేహాలకు సమాధానాలు తెలియాలంటే ఓ పదేళ్లు వెనక్కు వెళ్లాలి. పదేళ్ల యూపీఏ-1, యూపీఏ-2ల పాలనలో ఏఏ మీడియా సంస్థల హవా ఎలా కొనసాగిందన్న విషయం తెలిస్తే గానీ...ఇపుడు కొన్ని మీడియా సంస్థలు చేస్తున్న రాద్ధాంతం వెనుక అసలు మర్మం ఏమిటో తెలుస్తుంది. 

2004-14 వరకు భారత్ లోని యూపీఏ ప్రభుత్వ పాలనలో కొన్ని మీడియా సంస్థల హవా కొనసాగింది. యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్, అప్రకటిత ప్రధాని సోనియాల పాలన లెఫ్ట్, కాంగ్రెస్ అనుకూల మీడియా హౌస్ లకి స్వర్ణయుగం అని చెప్పవచ్చు. మన్మోహన్ విదేశీ పర్యటనకి వెళ్ళినప్పుడల్లా ఆయన వెంట ఇంటెలిజెన్స్ అధికారులతో పాటు IFS, IRS, IAS అధికారులు వెళ్లడం ఆనవాయితీ...అవసరం కూడా. వీరితోపాటు 'ఎయిర్ఇండియావన్' అనే ప్రత్యేక విమానంలో ముప్పైయారు మంది కాంగ్రెస్ అనుకూల మీడియా ప్రతినిధులు 'బిజినెస్' క్లాస్ లో ప్రయాణించేవారు. వాస్తవానికి అంతమంది అవసరం లేకపోయినప్పటికీ....విదేశాలను చూసేందుకు కాంగ్రెస్ అధిష్టానం వారికి గొప్ప అవకాశం కల్పించేదన్నమాట.

ఇక, విమానం ఎక్కినప్పటి నుండి ఆ మీడియా ప్రతినిధులకు కోరుకున్న ఫారెన్ బ్రాంగ్ మద్యం, కాంటినెంటల్ వంటకాలు వండి వార్చేవారు.  ఖరీదయిన విదేశీ మద్యం సరఫరా చేసేవారు విమానప్రయాణంలో. ప్రధాని వెళ్ళిన దేశంలో ఫైవ్ స్టార్ హోటల్ లో బస, రాచ మర్యాదలు జరిగేవి. ఒకరో ఇద్దరో మీడియా ప్రతినిధులు మన్మోహన్ సమావేశం కవర్ చేస్తే....మిగతా వారంతా టూరిజం ప్రదేశాలు చూసేందుకు వెళ్లేవారట. ఆ ఖర్చంతా అక్కడి రాయబార కార్యాలయాలదే. ఇక విదేశాల్లో ప్రధానితో పాటు విందులో పాల్గొన్న తర్వాత మన సదరు మీడియా ప్రతినిధులు...అక్కడ అతిథుల కోసం ఉంచిన మద్యం బాటిళ్లు పట్టుకొచ్చేవారట. అతిథి మర్యాదల ప్రకారం ప్రధానితోపాటు విదేశీ కానుకలు అందుకున్న మన జర్నలిస్టులు....స్వదేశానికి వచ్చిన తర్వాత.... దౌత్యవేత్తలకి మాత్రమే ఉండే 'గ్రీన్ చానల్' ద్వారా విమానాశ్రయం నుండి బయటికి వచ్చేవాళ్లు. దీంతో, కస్టమ్స్ చెకింగ్, పన్నులు లేకుండానే తమతో పాటు  ఖరీదైన వస్తువులు తెచ్చుకునేవారుట.

ఇక, పీఎంవో కార్యాలయంలో సదరు జర్నలిస్టుల హడావిడి..పైరవీలు చెప్పసాధ్యం కావు.  మౌనమునితో ఉన్న పరిచయాల ఆధారంగా అక్కడి అధికారులు వీళ్ళు అడిగిన పని చేసిపెట్టేవారట. ప్రధాని ఇచ్చే విందు సమావేశాలలో సదరు జర్నలిస్టులు సేవించేందుకు 'బ్లాక్- లేబుల్' మద్యం బాటిళ్లు తప్పనిసరిగా ఉండాలి. సమావేశం తర్వాత ఒకట్రెండు బ్లాక్ లేబుల్ బాటిళ్ళు తమతో పాటు పట్టుకెళ్లడం వారికి అలవాటు. అందుకే, పీఎంవో కార్యాలయంలో వారికి బ్లాక్ లేబుల్ బ్యాచ్ అని పేరు పెట్టి...వారు వచ్చే రోజు ఎక్కువ బాటిళ్లు ఉంచేవారట. ఇన్ని సేవలు చేసినందుకుగానూ...పద్మశ్రీ,, పద్మ విభూషణ్ లు కానుకగా ఇచ్చింది యూపీఏ ప్రభుత్వం. రాజ్ దీప్ సర్దేశాయ్ (క్రికెటర్ కొడుకు), బర్ఖా-దత్, శేఖర్ గుప్తా (పద్మ విభూషణ్), వినోద్ దువా, జావేద్ ఆనంద్ (తీస్తా సెతేల్వాద్  భర్త), ప్రఫుల్ బిద్వాయి, పుణ్య ప్రసూన్ బాజ్ పేయ్, విక్రం చంద్, ప్రాంజోయ్ గుహ తాకుర్త, రవీశ్ కుమార్, అరుణ్ పూరీ, నిధి రజ్దాన్, కరణ్ ధాపర్ ... వీరితో పాటు మరికొందరు కాంగ్రెస్ కోటాలో పద్మ అవార్డులు గెలుచుకున్నారు. డిసెంబర్ 2013 లో ఓ ప్రముఖ చానెల్ 25వ వార్షికోత్సవం రాష్ట్రపతి భవన్ లో జరిగింది. అదేమన్నా ఫంక్షన్ హాలా?

రాజ్ దీప్ సర్దేశాయ్ వంటి నిరుపేద జర్నలిస్టుల బంగ్లా ఢిల్లీ ల్యూటెన్స్ వంటి VVIP ప్రాంతంలో ఉండడం కాంగ్రెస్ కుంభకోణాలు దాచిపెట్టిన చలవే. మనీ లాండరింగ్ కేసులో కూరుకుపోయిన ఓ చానెల్, జర్నలిస్టులు బర్ఖా దత్, వీర్ సంఘ్వి, రోహిణీ సింగ్ లు.. నీర రాడియా టేపుల కుంభకోణంలో ఉన్నారు...వీరంతా కాంగ్రెస్ వీరవిధేయులే. తమ పార్టీలో ఏం జరుగుతోందో తెలుసుకోవడానికి....ట్రిబ్యున్ అనే కాంగ్రెస్ పత్రిక మన్మోహన్ చదివేవారట. 150 ప్రింట్, ఎలక్ట్రానిక్, వెబ్ మీడియా హౌసెస్ ప్రత్యక్షంగా, పరోక్షంగా కాంగ్రెస్ కి చెందినవేనని కపిల్ సిబాల్ నాలుక కరుచుకున్నారు. కాంగ్రెస్ కుంభకోణాలను సదరు మీడియా సంస్థలు కప్పి పుచ్చేవని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ రకంగా సదరు మీడియా సంస్థల యజమానులు, ప్రముఖ పాత్రికేయుల పని మూడు పువ్వులు ...ఆరు కాయలుగా ఉంది. ఇటువంటి సమయంలో 2014 ఎన్నికల్లో ప్రధాని మోడీ పగ్గాలు చేపట్టారు. పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. పీఎంవోలో పని చేసే వారు ఎవరైనా సరే ఉదయం 10.30 కల్లా వాళ్ళ బయోమెట్రిక్ పంచ్ వేయాల్సిందే. ప్రధాన మంత్రి సమావేశం ఉంటే I & PR ద్వారా తెలియచేస్తారు. 

సమావేశానికి ముందు బ్లాక్ లేబుల్ కు బదులు... టీ, బిస్కట్స్ మాత్రమే ఇస్తున్నారు. సమావేశం అయిపోయిన వెంటనే మీడియా ప్రతినిధులు వెళ్లిపోవాలి. రాజ్ దీప్ సర్దేశాయ్, బర్ఖా-దత్, రవీశ్ కుమార్ లాంటి వాళ్ళు మన్మోహన్ తో బాతాఖానీ వేసినట్లు...మోడీతో వేయడం కుదరదు.... దూరంగా ఉండి వివరాలు నోట్ చేసుకొని వెళ్లిపోవాలి. మోడీ విదేశీ పర్యటనలో దూర్ దర్శన్ కి సంబంధించిన 6 గురు సిబ్బందిని మాత్రమే తీసుకెళతారు. ఎయిర్ ఇండియా వన్ విమానంలోనే నిద్రపోయే మోడీ...అత్యవసరం అయితే విదేశాల్లోని హోటళ్లలో బస చేస్తారు. ప్రోటోకాల్ ప్రకారం విందు ఉన్నా కేవలం పళ్ల రసంతోనే సరిపెట్టేస్తారు. భారత్లో అడుగుపెట్టిన వెంటనే ఎయిర్ పోర్ట్ లోనే పత్రికా సమావేశం పెట్టి విలేఖరులకి తన పర్యటన విశేషాలు చెపుతారు. భారత్ లో మోడీ నిర్వహించే మీడియా సమావేశంలో కూడా మన్మోహన్ ఇచ్చినట్లుగా మద్యం, మాంసం ఉండవు. మన్మోహన్ హయాంలో అగస్టా వంటి కీలక రక్షణ రంగ కాంట్రాక్టుల విషయంలో తల దూర్చిన సదరు జర్నలిస్టులు...మోడీ హయాంలో ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటున్నారు. 

మోడీ హయాంలో ఎన్ జీవోల లెక్కలు అడగడంతో సదరు మీడియా సంస్థల తిక్క కుదిరింది. స్వదేశంలో ఆదాయం రాక, విదేశాలనుండి విరాళాలు ఆగిపోవడంతో సదరు మీడియా సంస్థలు తమ జేబుల్లోనుండి డబ్బు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. దీంతో, మోడీకి వ్యతిరేకంగా ఆ వర్గం కుట్రలు పన్నుతోంది. "మన్-కీ-బాత్" పేరుతో మోడీ తానే నేరుగా ప్రజలతో మాట్లాడడంతో సదరు మీడియా సంస్థల కవరేజి పెద్దగా అక్కర లేకుండా పోయింది. దూర్-దర్శన్ లోనే ఉచితంగా ప్రజలు మళ్ళీ ప్రధానికి సంబంధించిన వార్తలు చూడడం ప్రారంభించారు. ఫైవ్-స్టార్ హోటళ్ళకి వెళ్ళి ఎంజాయ్ చేసి బిల్ కట్టకుండా వచ్చే అవకాశం ఇప్పుడు లేదు కాబట్టి వీరంతా మోడీని శపిస్తున్నారు. మోడీకి కరోనా రావాలని, మోడీ చచ్చిపోతే బాగుండని కొందరు జర్నలిస్టులు పత్రికా స్వేచ్ఛను అడ్డుపెట్టుకొని ఇష్టారీతిలో మాట్లాడుతున్నారు. ఇటువంటి వారు పాల్ఘార్ లో నాగా అఖాడా సాధువులని చంపితే స్పందిస్తారని అనుకోవడం అవివేకం. అర్నాబ్ గోస్వామి వంటి జర్నలిస్టుపై దాడి చేసినా వీరు ఖండిస్తారని అనుకోవడం హాస్యాస్పదం. ఎందుకంటే వారి జెండా...ఎజెండా వేరు.