జీవీఎల్ చెలరేగడానికి కారణమెవరు?

February 22, 2020

జీవీఎల్ నరసింహారావు... బీజేేపీ సీనియర్ నేతగా, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా, ఏపీకి చెందిన రాజకీయ వేత్తగా... చాలా చాలానే మాట్లాడుతున్నారు. నిజమే.. తన పార్టీ వైఖరిని కుండబద్దలు  కొట్టినట్టుగా చెప్పడంలో తప్పు లేదు గానీ... సొంత పార్టీకి చెందిన ఏపీ నేతలు రాజధాని తరలింపుపై ఆవేదనాపూరిత వ్యాఖ్యలు చేస్తున్నా.. వాటిని ఓ వైరివర్గం మాదిరిగా రాజధాని తరలింపునకు అనుకూలంగా జీవీఎల్ చేస్తున్న వ్యాఖ్యలు నిజంగానే ఆసక్తికరమే. ఈ దిశగా నిన్న రాజధాని తరలింపుకనకు, జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానులకు మద్దతు పలుకుతూనే... ఏపీకి ప్రత్యేక హోదా అంటే గనున జగన్ కు కూడా టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు పట్టిన గతే పడుతుందంటూ .జీవీఎల్ చేసిన వ్యాఖ్యలు.. ఆయన వైఖరికి పరాకాష్టేనని చెప్పక తప్పదు. 
ఈ వ్యాఖ్య ద్వారా జీవీఎల్ ఏం చెప్పదలచుకున్నారు. బీజేపీతో పొత్తును తెగదెంపులు చేసుకున్న చంద్రబాబు మాత్రమే తమకు శత్రువు కాదని, ఏపీ సీఎం సీట్లో ఎవరు కూర్చున్నా కూడా తమకు వ్యతిరేకంగా మాట్లాడితే... వారు తమకు శత్రువే అన్నట్టుగా జీవీఎల్ భావిస్తున్నట్లుగా ఉంది కదా. అలా కాక పోతే... ప్రత్యేక హోదా అడిగినందుకే చంద్రబాబుతో వైరాన్ని ఎలా పెంచుకుంటారు? అలా కాకపోతే... ఓ వైపు జగన్ మూడు రాజధానులకు మద్దతు పలుకుతూనే... హోదా అంటే మాత్రం బాబు గతే అంటూ  ఎలా బెదిరిస్తారు? మొత్తంగా జీవీఎల్ ఒక్క చంద్రబాబుకో, ఒక్క జగన్ కో శత్రువు కాదు. మొత్తంగా ఏపీకే శత్రువునని జీవఎల్ తనకు తాను నిరూపించుకున్నారు. 
సరే... జీవీఎల్ వైఖరే అంత అనుకుందాం. మరి ఏపీలో ఉంటూ, ఏపీ ప్రజలను, ఏపీ ప్రజాప్రతినిధులను, ఏపీ సీఎంలను తమ చెప్పుచేతల్లో పెట్టుకునేలా, అలా కుదరకపోతే.. తొక్కేసమతామన్న రీతిలో జీవీఎల్ వ్యాఖ్యానిస్తుంటే... అసలు జీవీఎల్ కు నిరసనగా ఒక్క ఉద్యమమన్నా జరుగుతోందా? అదే తెలంగాణ వాళ్లపై జీవీఎల్ ఈ తరహా వ్యాఖ్యలు చేసి హైదరాబాద్ లో అడుగుపెడితే ఏమవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా. తెలంగాణకు వ్యతిరేకమన్నందుకే... ఏపీకి చెందిన ఓ ఎంపీని నడి హైదరాబాద్ లో దాడి చేసి కొట్టిన వైనం గుర్తుంది కదా. మరి ఏపీకి వ్యరేతికంగా, ఏపీ తనకు శత్రువు అన్నట్లుగా వ్యాఖ్యలు చేస్తున్న జీవీఎల్... ఏపీలో ఫ్రీగా తిరుగుతున్నారంటే... ఏపీ ప్రజలకు... ఒక్క ముక్కలో చెప్పాలంటే... ఆంధ్రోళ్లకు ఉద్యమ స్ఫూర్తి లేనట్టే కదా. మరి తెలంగాణ వాళ్ల మాదిరిగా ఆంధ్రోళ్లలో ఎప్పుడు ఉద్యమ స్ఫూర్తి నిండుతుందో ఏమో?