భారతీయులు ఎందుకు అవినీతి పరులు?

November 22, 2019

వారి ప్రవర్తనలో ఉన్న లోపం ఏమిటి? చేదు వాస్తవాలు తో కూడిన వ్యాసం ఇది.

ఇది భారతదేశంలోని అవినీతిపై ఒక న్యూజిలాండర్ అభిప్రాయం
భారతీయులు (hobbesian)స్వార్థపరులు. అవినీతి భారత దేశ సంస్కృతిలో భాగం. అవినీతిని భారతీయులు నీతి బాహ్యంగా చూడరు. ఇది అంతటా వ్యాపించి ఉంది.
భారతీయులు అవినీతి పరులను భరిస్తారు కానీ సంస్కరించడానికి పూనుకోరు.
జాతి కూడా పుట్టుకతో అవినీతిమయంగా ఉండదు.

భారతీయులు అవినీతిపరులు ఎందుకు అవుతున్నారు. ఇది తెలుసుకోవాలంటే వారి ఆచార వ్యవహారాలను చూడాల్సిందే.

మొదటగా ..
భారతదేశంలో లో ఒక వ్యాపార ప్రక్రియ. భారతీయులు దేవుడికి డబ్బులు అర్పిస్తారు. దానికంటే ఎక్కువ ప్రతిఫలాన్ని ఆశిస్తారు దీని అర్థం ఏమిటంటే అర్హత, అవసరం లేకున్నా లబ్ది పొందాలనుకోవడమే.
గుడి వెలుపల ఇటువంటి వ్యాపార ప్రక్రియను లంచం అంటాము.
బాగా ధనవంతుడైన భారతీయుడు గుళ్లకు డబ్బు ఇవ్వడు. బంగారు కిరీటాలు ఇతర ఆభరణాలు కానుకగా ఇస్తాడు.
అతని కానుకలు పేదవాడి ఆకలి తీర్చవు. అతడు ఇచ్చేది దేవుడికి.
ఆకలిగొన్న వాడికి సహాయం చేయడం వృధా అనుకుంటాడు. అందుకే దేవునికి కానుకలు ఇస్తాడు.

జూన్ 2009 లో హిందూ దినపత్రిక ఒక వార్త ప్రచురించింది. అదేమిటంటే జి .జనార్దన్ రెడ్డి కర్ణాటక మంత్రి 45 కోట్ల రూపాయలతో డైమండ్స్ పొదిగిన బంగారు కిరీటాన్ని తిరుమల గుడి కి ఇచ్చాడు.
విధంగా విపరీతమైన సంపద భారతదేశంలోని గుళ్ళల్లో పోగుపడుతుంది . సంపద ఏం చేయాలో వారికి అర్థం కాదు. కోశాగారాలలో బిలియన్ల కొద్దీ ఆస్తులు, డబ్బు దుమ్ము కొట్టుకుపోతున్నాయి.

యూరోపియన్స్ భారతదేశానికి వచ్చి పాఠశాలలు నెలకొల్పారు. భారతీయులు మాత్రం యూరప్, అమెరికా వెళ్లి అక్కడ గుళ్ళు నిర్మిస్తున్నారు.
తన కోర్కెలను తీర్చడానికి దేవుడు కానుకలు తీసుకోవడం ఎట్లా తప్పుకాదో, బయట లంచం తీసుకోవడం, ఇవ్వడం కూడా తప్పు కాదు అనే భావన నెలకొంది. అందుకే భారతీయులు తేలికగా అవినీతికి లొంగిపోతారు.

దేశ సంస్కృతి, అవినీతిని తనలో ఇముడ్చుకుంటుంది.
1.అవినీతిని భారతీయులు ఒక మచ్చగా భావించరు. ఎందుకంటే బాగా అవినీతిపరులైన రాజకీయ నాయకులను అధికారంలోకి తెస్తారు. ఇది పశ్చిమ దేశాలలో మనం ఊహించలేము.

2.చరిత్ర చూసినా కూడా అవినీతికి ఊతమిచ్చే నైతిక దిగజారుడుతనమే కనిపిస్తుంది. భారతదేశ చరిత్రలో లంచాలుకు లొంగి ద్వారాలు తెరవడం ద్వారా అనేక పట్టణాలు, రాజ్యాలను వశపరచుకున్న సంఘటనలు అనేకం. డబ్బు తీసుకొని లొంగి పోయిన సైన్యాధిపతులు అనేకం.
ఇది భారతదేశం అంతటా ఉన్న సారూప్యత.

పూర్వపు గ్రీకు, మోడ్రన్ యూరప్ తో పోలిస్తే, భారతీయుల పోరాట పటిమ ఎంతటిదో ఇట్టే అర్థమవుతుంది.
నా దేర్షాను అంతమొందించేందుకు టర్క్ లు పోరాడారు.
కానీ భారత దేశంలో పోరాటం అవసరం లేదు లంచాలు ఇవ్వడం ద్వారా సైన్యం లేకుండా చేయవచ్చు.
దండెత్తే వాడు డబ్బులు ఖర్చు పెట్టగలిగే వాడైతే భారతీయ రాజులను తేలికగా లొంగ తీసుకోవచ్చు.
రాజుల దగ్గర పదుల వేల సంఖ్యలో సైన్యం ఉన్నప్పటికీ ఇది సాధ్యం.

ప్లాసి యుద్ధం లో భారతీయులు గట్టిగ యుద్ధం చేశారు. తర్వాత ఏమైంది మీర్ జాఫర్ కు Clive లంచం ఇచ్చాడు. అంతే బెంగాల్ లొంగి పోయింది.

భారతీయ కోటలను వశపరచుకున్న చాలా సంఘటనలలో డబ్బు మారక పాత్ర ఉంది. డబ్బు ముట్టి నందున గోల్కొండ వెనుక దర్వాజ తెరచి ఉంచడం వలన 1867లో కోటను ఆక్రమించు కోగలిగారు.

మరాఠాలను, రాజపుత్రుల ను లంచాల ద్వారానే మొగలులు గెలుచుకోగలిగారు.

శ్రీనగర్ రాజు ఔరంగజేబు దగ్గర డబ్బులు తీసుకుని సులేమాన్ ను అప్పగించాడు.

భారతీయులు అవినీతికి తలొగ్గి చేసిన దేశద్రోహ కార్యక్రమాలు అనేకం ఉన్నాయి.
అర్థం చేసుకోవాల్సినదేమిటంటే భారతీయులకు ఇచ్చిపుచ్చుకునే (లంచాలు)సంస్కృతి ఎందుకు వచ్చింది ఇతర నాగరిక దేశాలలో ఇది ఎందుకు లేదు?

3. నైతికంగా అవినీతి రహితంగా మసలుకుంటే 'అందరము బాగుపడతాము' అనే స్వభావం భారతీయులలో కొరవడడానికి మూల కారణం, వారు అనుసరించే మతంలో సందేశం లేకపోవడమే.
కులవ్యవస్థ వారిని వేరుపరుస్తుంది. మనుషులందరూ సమానమే నని వారు నమ్మరు. దీని ఫలితమే విభజన.
మత మార్పిడులు జరిగాయి. చాలామంది హిందువులు సిక్కులు, జైనులు, బౌద్ధులు అయ్యారు.
చాలామంది క్రిస్టియన్లు, ముస్లింలు గా మారారు. భారతీయులు ఒకరిపై, మరొకరికి విశ్వాసం ఉండదు.

భారతదేశం లో భారతీయులు లేరు. అక్కడ హిందువులు, క్రిస్టియన్లు ముస్లింలు మొదలగువారు ఉన్నారు. 1400 సంవత్సరాల క్రితం భారతీయులంతా ఒకే విశ్వాసం కలిగి ఉండేవారు.

కులాలుగా మతాలుగా విడిపోవడం తో అనారోగ్య సంస్కృతి దాపురించింది. అసమానతలు అనేవి అవినీతి సమాజానికి దారితీస్తాయి. భారతీయులు ఒకరినొకరు ఈసడించుకుంటారు,ఒక్క దేవుడిని తప్ప. అతనికి కూడా లంచం ఇస్తారు.

బ్రియాన్
న్యూజిలాండ్

(బాధతో వాస్తవాలను అంగీకరిస్తూ )

ఉన్నది ఉన్నట్లుగా మాత్రం edit చేయకుండా English వ్యాసాన్ని అనువదించడం జరిగింది.

 

( న్యూజిలాండ్ అతి తక్కువ అవినీతి ఉన్న దేశం)

 

Read Also

యువరాజకు పట్టాభిషేకం..?
ఆ వీడియోతో జగన్ రహస్యం బట్టబయలు
జగన్, బీజేపీ దోస్తీ ముగిసింది.. కుస్తీ మొదలైంది