జర్మనీ తప్ప యూరప్ లో మరణాలెక్కువ...ఎందుకు?

August 03, 2020

కరోనా కేసులు, మరణాల తర్వాత అమెరికా అన్నింట్లోను అగ్రరాజ్యమే అనిపించుకుంది. ప్రపంచంలో అత్యధిక కేసులు, మరణాలు ఆ దేశానివే. దాని గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ కరోనా విలయతాండవం గురించి మనం పుంఖానుపుంఖాలుగా వార్తలు వింటున్నాం. దాని తర్వాత స్థానంలో యూరప్ దేశాలు ఒక దానితో ఒకటి పోటీపడుతున్నాయి. అయితే,  యూరప్ దేశాల మరణాలను గమనించినపుడు ఒక విషయం మాత్రం మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ప్రతి యూరప్ దేశమూ మరణాలతో హాహాకారాలు చేస్తుంటే... ఒక్క జర్మనీ మాత్రం కనీస మరణాలతో బెటర్ పొజిసషన్లో ఉంది. ఎందుకిలా?

యూరప్ లా మానవ జీవిత కాలం ఎక్కువ. అక్కడ క్వాలిటీ జీవనం ఉంటుంది. చిన్న దేశాలు. సమర్థ నాయకత్వాలు. మంచి వాతావరణం... ప్రొడక్టవిటీ ఉన్న ప్రజలు దీనివల్ల మనిషి జీవిత కాలం అక్కడ ఎక్కువగా ఉంటుంది. అందుకే ప్రపంచంలో ఇతర ప్రాంతాలతో పోలిస్తే... యూరప్ లో వృద్ధులు ఎక్కువగా ఉంటారు. ఎక్కువ అంటే.. మామూలు ఎక్కువ కాదు... 30-50 శాతం జనాభా వృద్ధులే. ఇక ఇటలీలో కూడా ఈ వృద్ధ జనాభా చాలా ఎక్కువ. వందేళ్లు బతికినవాళ్లు ఇటలీలో పెద్ద సంఖ్యలో ఉంటారు. అక్కడ అది సర్వసాధారణం. అందుకే శ్వాసకోస వ్యాధి అయిన కరోనా వారిని ఎక్కువ ప్రభావితం చేస్తుంది. అందుకే వృద్ధ జనాభా ఎక్కువగా ఉండే యూరప్ లో మరణాలు చాలా ఎక్కువ నమోదవుతున్నాయి.  యూరప్ దేశాలతో పోలిస్తే జర్మనీలో వృద్ధుల శాతం కొంచెం తక్కువే అయినా ప్రపంచ దేశాలతో పోలిస్తే అక్కడా ఎక్కువే. 22 శాతం ఈ దేశ జనాభాలో వృద్ధులు ఉన్నారు. అసలు జర్మనీ సగటు వయసు 45.7 సంవత్సరాలు. 

కానీ జర్మనీలో తక్కువ మరణాలు నమోదు కావడానికి అనేక కారణాలున్నాయి. ప్రపంచంలోనే అత్యంత సమర్థంగా కరోనాను ఎదుర్కొంటున్న టాప్ 10 దేశాల్లో జర్మనీ ఒకటి. ఆ దేశ జీడీపీలో పది శాతం కరోనా ప్యాకేజీ ప్రకటించింది. ఇంత పెద్ద ప్యాకేజీ ఏ కంట్రీ ఇవ్వలేదు. దీంతో అన్ని సదుపాయాలు కల్పించలిగింది. క్రిటికల్ కేర్ బెడ్స్ చాలా ఎక్కువగా అందుబాటులో ఉన్న దేశం కూడా కావడం వల్ల ఇటీలీలోగా వెంటిలేటర్ల కొరతతో చికిత్సను నిరాకరించడం జరగలేదు. టెస్టింగ్ ట్రేసింగ్ లో కూడా చాలా వేగంగా పనిచేసింది. జర్మనీలో ప్రతి లక్షమందికి 34 వెంటిలేటర్లు ఉంటే ఇటలీలో కేవలం 7 మాత్రమే ఉన్నాయి. మంచి చికిత్స, సాధారణ జనాలతో కరోనా రోగులను వెంటనే గుర్తించి వేరు చేయడం వంటి కారణాల వల్ల వ్యాప్తిని అడ్డుకోవడం ఇంకా లక్షణాలు ప్రబలకుండానే చికిత్స మొదలుపెట్టడంతో ఎక్కువ ప్రాణాలు కాపాడుకోగలిగింది జర్మనీ. జర్మనీ మామూలు దేశం కాదు... మనం చూసే అత్యంత ఖరీదైన కార్లన్నీ ఆ దేశానివే. ఆ దేశ నాయకులు పాలన గురించి ఎంత శ్రద్ధ పెడతారంటే... ప్రజల ఎక్స్ పెక్టేషన్ కు మనం రీచ్ అవగలమా? అన్న వేదనతో అక్కడి రాష్ట్రంలోని ఒక ఆర్థిక మంత్రి ఆత్మహత్య చేసుకున్నారు. అసలు ప్రజల సమస్యల గురించి ఇంత ఆవేదన చెందేవారు ఎక్కడైనా ఉంటారా? అంటే ఇక్కడ ఆత్మహత్య చేసుకునే వాడు బాధ్యత ఉన్నవాడు అని చెప్పడం లేదు. వాళ్లు ప్రజల సమస్యలను అంత సీరియస్ గా తీసుకుంటారని చెప్పడం మా ఉద్దేశం.