అమ‌రావ‌తి మార్పు వెనుక క్రైస్త‌వ మిషిన‌రీలు?

July 16, 2020

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ నిర్ణ‌యం వెనుక క్రైస్త‌వ మిషిన‌రీల ప్ర‌భావం ఉంద‌ని స‌మాచారం. 2300 సంవ‌త్స‌రాల‌కు పైబ‌డిన చరిత్ర అమ‌రావ‌తి సొంతం. శాత‌వాహ‌నులు, ఇక్ష్వాకులు మ‌రియు ప‌ల్ల‌వులు 5వ శ‌తాబ్ధం నుంచి ఇక్క‌డ ప‌రిపాలించారు. హిందువులు మ‌రియు బౌద్ధుల‌కు అమ‌రావ‌తి ఎంతో గొప్ప ఆరాధ‌నీయ ప్రాంతం. హిందువుల యొక్క ప‌విత్ర‌మైన పంచారామా క్షేత్రాల్లో అమ‌రావ‌తిలో ఉన్న అమ‌ర‌లింగేశ్వ‌ర స్వామి దేవాల‌యం ఒక‌టి. 2వ శ‌తాబ్ధంలో నిర్మించిన అమ‌రావ‌తి స్థూపం వ‌ల్ల బుద్ధులకు ముఖ్య‌మైన‌ ప్రాంతం. ఇలా ప్రాశ‌స్త్యం క‌లిగి ఉన్న ప్రాంతం 18 శ‌తాబ్ధాల త‌ర్వాత త‌న పూర్వ వైభ‌వాన్ని సంత‌రించుకుంది.
అయితే, ఏపీలో జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయిన అనంత‌రం క్రైస్త‌వ మిష‌న‌రీలు రాష్ట్రంలో బ‌ల‌ప‌డాల‌ని, మెజార్టీ ప్ర‌జ‌ల‌ను క్రైస్త‌వంలోకి మార్చి ద‌క్షిణాదిలో మొట్ట‌మొద‌టి క్రైస్త‌వ రాష్ట్రంగా ఏపీని మార్చాల‌ని చూస్తున్నాయి. ఈ క్ర‌మంలో వీరికి హిందూ మ‌రియు బౌద్ధుల ప్రాచీన స్థ‌లంలో రాజ‌ధాని ఉండ‌టం ఇష్టం లేదు. త‌మ మ‌త‌మార్పిడుల‌కు సౌక‌ర్య‌వంత‌మైన న‌గ‌రంగా విశాఖ‌ప‌ట్టణాన్ని వారు భావించార‌ని అందుకే రాజ‌ధాని త‌ర‌లింపు అనే ప్ర‌చారం పెద్ద ఎత్తున జ‌రుగుతోంది.
ఒక్క‌దెబ్బ‌కు రెండు పిట్ట‌లు అనే ల‌క్ష్యంతో సాగుతున్నారు. ఇందులో మొద‌టిది త‌ట‌స్థంగా ఉండే న‌గ‌రాన్ని ద‌క్షిణాదిలోనే మొద‌టి క్రైస్త‌వ రాష్ట్రానికి రాజ‌ధానిగా చేసుకోవ‌డం. రెండోది ప్ర‌పంచంలోనే ప్ర‌ముఖ హిందూ మ‌రియు బౌద్ధ ప్రాశ‌స్య‌మైన రాజ‌ధానిగా ఎదిగే అమ‌రావ‌తిని ఆదిలోనే తొల‌గించ‌వ‌చ్చు. ఇప్ప‌టికే మిష‌నరీల ఆకాంక్ష ప్ర‌కారం, ఇంగ్లిష్ భాష‌ను ప్ర‌వేశ‌పెట్టి తెలుగు భాష‌ను దూరం చేసిన జ‌గ‌న్ స‌ర్కారు క్రైస్త‌వ మ‌తం వ్యాప్తికి తీసుకున్న రెండో నిర్ణ‌యం రాజ‌ధాని మార్పు అని భావించ‌వ‌చ్చు.
ఈ నేప‌థ్యంలో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న హిందువులు మ‌రియు బౌద్ధులు క‌లిసిక‌ట్టుగా కృషి చేసి ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ త‌క్ష‌ణ‌మే రాజ‌ధాని త‌ర‌లింపు అంశంలో జోక్యం చేసుకోవాల్సిందిగా ఒత్తిడి తీసుకురావాల్సిన అవ‌స‌రం ఉంది. అమ‌రావ‌తిని రాజ‌ధానిగా కొన‌సాగిస్తూ సీఆర్‌డీఏ ప‌రిధిలోనే అభివృద్ధి చేసేలా చూడాల్సి ఉంది. దీంతోపాటుగా మ‌త మార్పిడుల‌ను అడ్డుకునేలా కేంద్రం చొర‌వ తీసుకునేలా ప్ర‌య‌త్నం చేయాల్సి ఉంది. 

Read Also

అమరావతి ధర్నాలు - ఆ పుకారు నిజం కాదు
ఎస్వీబీసీ చానల్ బాధ్యతలు ఆ దర్శకుడికా?
రాజ్యమేలుతున్నది జగన్ కాదు అరాచకం