రాయలసీమ కోసం నిలబడతా - కేసీఆర్ కొత్త కుట్ర ?

May 28, 2020

జనాలను ఎర్రిపప్ప లు అనుకునేవారిలో మొదటి ర్యాంకు కేసీఆర్ దే. దేశమంతా సర్వనాశనం అయినా పర్లేదు... సంస్కృతి పాడైనా పర్లేదు. తెలంగాణ ఉండాలి, అది నా చేతిలో ఉండాలి అనుకునే వ్యక్తి కేసీఆర్. ఆయన ఏం మాట్లాడినా... అందులో తన యాంగిల్ తప్ప ఇంకొకరి క్షేమం అనేది ఇసుమంత కూడా ఉండదు. కానీ సామాన్యులకు మాత్రం కేసీఆర్ అంత మంచోడు లేడు అనిపిస్తుంది. తాజాగా కేసీఆర్ తమిళనాడులోని కాంచీపురం ఆధ్యాత్మిక పర్యటనకు వెళ్లారు. అక్కడ అత్తి వరదరాజస్వామిని దర్శించుకున్నారు. అనంతరం తిరుగు ప్రయాణంలో చిత్తూరు జిల్లా నగరిలో రోజా నివాసంలో ఆగారు.

రెండు గంటల పాటు రోజా ఇంట్లో ఉన్న కేసీఆర్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాయలసీమ కోసమే తాను పుట్టినట్లు చెప్పుకువచ్చారు. కేసీఆర్ ఏమన్నారో చూద్దాం.. 

రాయలసీమ బాధలు నాకు తెలుసు. రాయలసీమకు గోదావరిజలాలు రావాల్సినన అవసరం ఉంది. గోదావరి జలాలు వృథాగా సముద్రంలోకి వెళ్తున్నాయి. పట్టుదల, నిజాయతీ కలిగిన యువకుడు నాయకుడు ఏపీకి సీఎంగా ఉన్నారు. అది ఖచ్చితగా సాధ్యమవుతుంది. సుమారు వెయ్యి టీఎంసీలు నీళ్లు గోదావరి నుంచి పోయాయి. సముద్రంలోకి పోతున్నాయి. వృథాగా పోయే నీటిని వాడుకుంటే బంగారు పంటలు పండుతాయి. రాయలసీమ అభివృద్ధికి మా వంతు సాయం చేస్తాం. రతనాల సీమగా మార్చడానికి రెండు రాష్ట్రాల అభివృద్ధికి ఇద్దరు సమన్వయంతో పనిచేస్తాం. 70 తెలుగు వారి చరిత్రలో కొత్త అధ్యాయం లిఖించబోతున్నాం. 

ఈ మాటలు వింటే ఎవరికైనా పాపం కేసీఆర్ ఎంత మంచోడు. తన సంక్షేమమే కాకుండా పక్క రాష్ట్ర సంక్షేమాన్ని కూడా కోరుకుంటున్నాడు. పైగా రాయలసీమ వెనుకబాటుతనాన్ని బాగా అర్థం చేసుకున్నాడు అని అనుకునేలా ఉంది. ఇందులో వాస్తవం తరచిచూస్తే తెలుస్తుంది. ఇది ఉదారత కాదు... స్వార్థం. అదెలాగో చూద్దాం.

గోదావరికి ఈసారి నీళ్లు బాగా వచ్చాయి. కానీ ప్రతిసారి ఇలాగే రావు. అలాంటి సమయంలో కూడా భద్రాచలం తర్వాత పోలవరంలో నీళ్లుంటాయి. దీనికి చత్తీస్ ఘర్ నుంచి వచ్చే ఇంద్రావతి నది కారణం. అక్కడి నీళ్లు తీసుకెళ్లాలి అంటే... పోలవరం నీటిని దోపిడీ చేసినట్టు. మరి దానికి కోస్తా ప్రజలు మద్దతు ఇవ్వరు. అపుడు జగన్ పై వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉంది. దీనికి కేసీఆర్ కి ఒక ఐడియా వచ్చింది. రాయలసీమకు నీళ్లు అని రాయలసీమ ప్రజలను రెచ్చగొట్టాలి. అది కేవలం కేసీఆర్ జగన్ ఊహించిన ఎత్తిపోతల ద్వారా సాధ్యమని నమ్మించాలి. అపుడు రాయలసీమ ప్రజలు జగన్ కు మద్దతు పలుకుతారు. చంద్రబాబు కూడా రాయలసీమలో వ్యతిరేకత వస్తుందని మాట్లాడకుండా ఉంటాడు. అపుడు చక్కగా ఏపీ డబ్బులతో తెలంగాణ గడ్డపై ఎత్తిపోతల కట్టి శ్రీశైలం కి నీరిస్తానని చెప్పొచ్చు. కానీ ప్రాజెక్టు పూర్తయ్యాక ఆ నీరు తెలంగాణ పొలాల్లో పారుతుంది. అసలు శ్రీశైలం దాకా చేరనివ్వరు. అపుడు రాయలసీమ ఎడారే. కానీ ఏపీ డబ్బులు మాత్రం ఖర్చయి ఉంటాయి. ఇదంతా జరగాలంటే... రాయలసీమ ప్రజలను నమ్మించాలి. రెచ్చగొట్టి నీటికోసం ఉద్యమించేలా చేయాలి. అపుడు తెలంగాణకు నీళ్లు దోచుకుని వెళ్లొచ్చు. ఇది కేసీఆర్ అసలు ప్లాన్.