మైండ్ బ్లోయింగ్.... కోడెలను ఇరికించిన కేసుల భారీ లిస్టు ఇదే !

July 07, 2020

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య రాష్ట్రంలో పాలక, విపక్షాల మధ్య తీవ్ర ఆరోపణలు, ప్రత్యారోపణలకు దారి తీసింది. వైసీపీ ప్రభుత్వ వేధింపుల వల్లే అవమానంతో, తీవ్ర ఒత్తిడికి గురై కోడెల ఆత్మహత్య చేసుకున్నారని టీడీపీ ఆరోపిస్తుండగా... చంద్రబాబు పట్టించుకోకపోవడం వల్లే కోడెల ఆత్మహత్య చేసుకున్నారంటూ వైసీపి ఆరోపిస్తోంది. కోడెలపై వైసీపీ ప్రభుత్వం హయాంలో ఎలాంటి కేసులూ పెట్టలేదని చెప్పుకొస్తోంది. అయితే.. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత సత్తెనపల్లి, నరసారావుపేట పోలీస్ స్టేషన్లలో 19 కేసులు ఆయన, కుమారుడు, కుమార్తెపై నమోదైనట్లు తెలుస్తోంది.

వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత కోడెల కుటుంబంపై కేసులు ఇవీ..
* క్రైమ్ నెంబర్ 123/2019: తీవ్రమైన తీవ్రమైన నేరారోపణలతో సెక్షన్ 384 506 r/w 34 కింద ఐపీసీ నరసరావుపేట ఒకటో పట్టణ పీఎస్ లో కేసు నమోదు.
* కేసు నెంబర్ 131/2019: section 384, 506 r/w 34 ipc కింద నరసరావుపేట పట్టణ పోలీసులు కేసు నమోదు
* క్రైమ్ నెంబర్ 136 /2019: తీవ్రమైన నేరారోపణలతో సెక్షన్ 420 ipc చీటింగ్ కింద సత్తెనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు
* క్రైమ్ నెంబర్ 149/ 2019: తీవ్రమైన నేరారోపణలతో సెక్షన్ 420 ipc చీటింగ్ కింద సత్తనపల్లి పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు
* క్రైమ్ నెంబర్ 150/ 2019: సెక్షన్ 420 506 r/w 34 ipc మరియు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నరసరావుపేట ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు
* 163/2019: తీవ్రమైన సెక్షన్ 324, 565, 34 ipc మరియు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద నరసరావుపేట ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు
* క్రైమ్ నెంబర్ 164/ 2019: సెక్షన్ 420, 323, 506 34 ipc చీటింగ్ కింద నరసరావుపేట రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు
* క్రైమ్ నెంబర్ 169 / 2019:  సెక్షన్ 420, 468, 472, 477, 387, 34 ipc చీటింగ్ మరియు ఫోర్జరీ కింద నరసరావుపేట రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు
* క్రైమ్ నెంబర్ 172 /2019: సెక్షన్ 447, 506, 109 కింద నరసరావుపేట ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు
* క్రైమ్ నెంబర్ 231 / 2019: సెక్షన్ 354, 384, 323, 447, 506 నరసరావుపేట రూరల్ పోలీస్స్టేషన్లో కేసు.
* క్రైమ్ నెంబర్ 235 / 2019: సెక్షన్ 384, 506 కింద నరసారావుపేట రూరల్ స్టేషన్లో కేసు
* క్రైమ్ నెంబర్ 238 / 2019: సెక్షన్ 384, 506 కింద నరసారావుపేట రూరల్ స్టేషన్లో కేసు
* క్రైమ్ నెంబర్ 244 / 2019: సెక్షన్ 409, 422 కింద తూల్లూరు స్టేషన్లో కేసు. ఇది అసెంబ్లీలో ఫర్నిచర్ మాయం కేసు.
* క్రైమ్ నెంబర్ 245 / 2019: సెక్షన్ 384, 323, 506 కింద నరసారావుపేట రూరల్ స్టేషన్లో కేసు.
.... పైన చెప్పిన కేసులన్నీ కోడెల శివప్రసాద్‌పై పెట్టినవి కాగా.. 2016, 2017, 2018లో జరిగిన ఘటనలకు సంబంధించినవంటూ కోడెల కుమారుడు, కుమార్తెపైనా కేసులు పెట్టారు.

చేతులెత్తేసిన డీజీపీ
ఫిర్యాదుదారులు చేసిన ఆరోపణలన్నీ మూడేళ్ల కిందట కానీ ఒకవేళ అవి నిజమని భావించిన మూడేళ్లకు మించి ఉండదని సెక్షన్ 41, 41 ఏ ప్రకారం స్టేషన్ బెయిలు ఇవ్వొచ్చంటూ నరసరావుపేట డిఎస్పీని కోడెల న్యాయవాదులు కోరారు. కానీ, డీఎస్పీ కోడెలపై నానా మాటలు కూసి బెయిలు ఇవ్వలేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. చివరకు కోడెల డిజిపిని సంప్రదించగా తాను ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నానని.. విజయసాయి రెడ్డి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ కేసులో ఇన్వాల్వ్ కావడంతో తానేమీ చేయలేనని చెప్పారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు

కోడెలపై పెట్టిన కేసులు ఎలాంటివంటే..
* కోడెల శివప్రసాద్ కుమారుడు కోడెల శివరాం తనకు రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి తన దగ్గర డబ్బులు తీసుకున్నారంటూ రంజీ క్రికెట్ ప్లేయర్ నాగరాజు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు శివరాంపై మోసం కేసు పెట్టారు. ఈ ఫిర్యాదు చేసిన నాగరాజుపై ఇప్పటికే అనేక స్టేషన్లో క్రిమినల్ కేసులు ఉన్నాయని, అలాంటి క్రిమినల్ చరిత్ర కలిగిన వ్యక్తులతో వైసీపీ నేతలు కేసులు పెట్టించి కోడెల కుటుంబాన్ని వేధించారని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు.
* బుచ్చి వెంకాయమ్మ అనే మహిళ 2016లో తన కుమారుడికి చెందిన ఒకటింపావు సెంట్ల భూమిని తన బావ అమ్ముకున్నాడని.. తన బావ కోడెల అనుచరుడు కావడంతో కోడెల కుమారుడి దృష్టికి తీసుకెళ్లామని, కానీ, వారు పట్టించుకోలేదని కేసు పెట్టారు. ఇది కోడెల కుటుంబానికి సంబంధం లేని కేసని టీడీపీ నేతలు అంటున్నారు.
* రవి అనే వ్యక్తి ఇంకో ఫిర్యాదు చేశారు. నరసరావుపేటలో కోడెల శివరాం తనను కులం పేరుతో దూషించారని రవి కేసు పెట్టారు. దీన్ని పోలీసులు అట్రాసిటీ కేసుగా నమోదు చేసుకున్నారు. అయితే, ఆయన చెప్పిన తేదీల్లో శివరాం విదేశాల్లో ఉన్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఈ  ఫిర్యాదు చేసిన రవి అనే వ్యక్తి గతంలో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన కేసులో జైలుకు కూడా వెళ్ళి వచ్చాడు.
* కోడెలను కుమారుడు కొట్టడం వల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నారంటూ సాక్షి చానల్లో స్క్రోలింగు వేశారని.. కానీ, ఆగస్టు 17 నుంచి కోడెల కుమారుడు కెన్యాలో ఉన్నారని.. అలాంటి ఆయన చేయి చేసుకోవడం ఎలా సాధ్యమవుతుందని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.