చంద్రగిరి రీపోలింగ్ ... షాకింగ్ నిజాలు

May 26, 2020

ఎవరేమనుకుంటే మాకేంటి... జగన్ కంప్లయింట్ ఇవ్వాలే గానీ మేము ఆఘమేఘాల మీద స్పందిస్తాం. మీరు తిట్టినా విమర్శించినా మేము వెనక్కు తగ్గేది లేదు అన్నట్టు ఎన్నికల సంఘం ప్రవర్తిస్తోందని ఈరోజు సోషల్ మీడియా కోడై కూసింది. దీనికి కారణం లేకపోలేదు. ఎందుకంటే సరిగ్గా పది పదిహేను రోజుల క్రితం ఇక్కడ రీపోలింగ్ పెట్టమని టీడీపీ అడిగితే... దానిని ఎన్నికల సంఘం పట్టించుకోలేదు. కానీ వైసీపీ అడిగిన తక్షణం అనూహ్యంగా రీపోలింగ్ కు ఆదేశించింది. టీడీపీ పలుమార్లు, పలువురు బాధ్యులకు విన్నవించిన పట్టించుకోని ఈసీ వైసీపీ ఇచ్చిన ఒక్క వినతి పత్రానికి తెగ వేగంగా స్పందించింది. దీంతో ఈసీపై ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే... ఈ నియోజకవర్గానికి సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలు తెలుస్తున్నాయి. ప్రస్తుతం టీడీపీ ఓట్లను కొల్లగొట్టడమే లక్ష్యంగా ఈ రీపోంగ్ వెనుక ఉద్దేశమని అర్థమవుతోంది. ఇది అర్థం కావాలంటే.... 2014లో ప్రస్తుతం రీపోలింగ్ జరుగుతున్న ఆ 5 పోలింగ్ బూత్ ల వివరాలు కావాలి. 2014లో ఈ ఐదు పోలింగ్ బూతుల్లో కలిపి 3454 ఓట్లు పోలయ్యాయి. అందులో టీడీపీకి 85 శాతం ఓట్లు వచ్చాయి. అంటే 2942 ఓట్లు ఈ బూతుల్లో టీడీపీకి పడ్డాయి. 12 శాతం ఓట్లు వైసీపీకి 3 శాతం ఇతరులకు పడ్డాయి. అంటే వైసీపీకి పడిన ఓట్లు కేవలం 420. అంటే ఎలాగూ టీడీపీకి ఎక్కువగా ఓట్లు వచ్చే ఈ బూత్ లలో ఓటింగ్ శాతం తగ్గించడానికే ఈ ప్రయత్నం. విచిత్రం ఏంటంటే... గత ఏడాది ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే గెలిచాడు. ఈసారి అతన్ని జనం ఓడిస్తారని టాక్ వచ్చిన నేపథ్యంలో ఇలా అడ్డదారుల్లో వైసీపీ పయనిస్తోందని తెలుగుదేశం నియోజకవర్గ నేతలు ఆరోపిస్తున్నారు. గత ఏడాది ఇక్కడ మెజారిటీ కూడా 4518 ఓట్లు మాత్రమే. కాబట్టి స్వల్ప తేడా ఉన్న ఈ నియోజకవర్గంలో ఎలాగైనా మళ్లీ సీటు నిలబెట్టుకునేందుకు వైసీపీ ప్రయత్నం చేసినా వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. మరి ఇప్పటికే పూర్తయిన పోలింగులో ప్రజలు ఎవరి వైపు ఉన్నారో తెలియాలంటే మే 23 వరకు ఆగక తప్పదు.