ఆ హీరోయిన్ పెళ్లిని ఎందుకు దాచిపెట్టిందంటే..?

May 29, 2020

తన అందాలతో కుర్రాకారుకు కంటి నిండా కునుకు లేకుండా చేసిన శ్రియకు పెళ్లై  ఏడాదిన్నర  అవుతోంది. రష్యన్ టెన్నిస్ ప్లేయర్ కమ్ బిజినెస్ మ్యాన్ అయిన ఆండ్రీ కొషీవ్ ను ప్రేమించి పెళ్లాడిన సంగతి తెలిసిందే. గుట్టు చప్పుడు కాకుండా అతి కొద్ది మంది అతిధుల మధ్య తన పెళ్లిని పూర్తి చేసుకున్న శ్రియ చాలామందికి షాకిచ్చింది.
పెళ్లిని అంత సీక్రెట్ గా ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందన్న మాటపై ఇప్పటివరకూ ఆమె స్పందించింది లేదు. గత మార్చిలో ఆమె వివాహ విషయం బయటకు వచ్చింది. గుట్టు చప్పుడు కాకుండా ఆండ్రీని పెళ్లాడటం ద్వారా  అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
ఇంతకీ పెళ్లి విషయం ఎందుకంత సీక్రెట్? అన్న ప్రశ్నకు తాజాగా రియాక్ట్ అయ్యింది. తన జీవితాన్ని ప్రైవేటుగా.. సింఫుల్ గా ఉంచుకోవటానికే తాను ఇష్టపడతానని.. నటనే తన ఆహారమని పేర్కొంది శ్రియ. తన భర్త కూడా తాను నటించే విషయంలో చాలా సపోర్ట్ చేస్తారని చెప్పుకొచ్చింది.
తాను ఎక్కువగా పని చేస్తూ బిజీగా ఉంటే.. ఆయన సంతోషిస్తారన్న శ్రియ..తాను పని చేయటమే అతనికి ఇష్టమని చెప్పటం గమనార్హం. ప్రేమ వివాహం తర్వాత కూడా నటిస్తున్న ఈ అందాల బొమ్మ తన తాజా వ్యాఖ్యలతో ఒక విషయాన్ని అయితే క్లియర్ చేశారని చెప్పాలి. తాను నటిస్తూనే ఉంటానని.. తనకు.. తన భర్తకు పని చేయటం మీదనే ఫోకస్ అన్న విషయాన్ని చెప్పకనే చెప్పేసిందని చెప్పాలి. అయ్యో శ్రియకు పెళ్లి అయ్యిందన్న దిగులు అక్కర్లేదని.. తాను తెర మీద కనిపిస్తాననే సంకేతాల్ని ఇచ్చేసినట్లే.