మే 2వ తేదీ మోడీ చెప్తారు?

August 06, 2020

ప్రస్తుతం ఇండియా మొత్తం మీద ఇదే ఆసక్తికరమైన ప్రశ్న. 40 రోజులు సుదీర్ఘ లాక్ డౌన్ తో ప్రజలు బేజారెత్తిపోవడం ఒకటైతే చిరుద్యోగులు, సామాన్యులు చితికి పోయారు. కరోనాతో ఇబ్బంది పడని గ్రామాలు కూడా తమ పంటను అమ్ముకోవడానికి నగరాల మీద ఆధారపడటం వల్ల అమ్ముకోలేక నష్టపోయాయి. ఈ నేపథ్యంలో మే 3న అయినా తమకు విముక్తి దొరుకుతుందా ? లేదా? అన్న పెద్ద ప్రశ్న జనాన్ని వేధిస్తోంది

తాజాగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ’లాక్ డౌన్ పొడగింపు ఉంటుంది. కానీ అది హాట్ స్పాట్లు, రెడ్ జోన్లకే పరిమితం అవుతుంది‘ అన్నారు. కొంత ఊరట. కొంత బాధ. మహా నగరాలకు పాక్షిక విముక్తే దొరుకుతుంది. మరో విషయం ఏంటంటే... ప్రజా రవాణా వ్యవస్థ ఉండదు. వినోదం, మాల్ షాపింగ్ కి చాలా సమయం పడుతుంది. కాకపోతే ఇంతకుమించి లాక్ డౌన్ కొనసాగిస్తే కరోనాకు మించిన ప్రమాదం ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి పూర్తి స్థాయిలో దీనిని ఎట్టి పరిస్థితుల్లో కొనసాగించరు. మనదేశంలో ఎక్కువ కేసులు నమోదవుతున్నా... అవన్నీ పరిమిత ప్రాంతాలకే కావడం వల్ల... మిగతా ప్రాంతాలకు లాక్ డౌన్ నుంచి విముక్తి దొరుకుతంది?

బహుశా మోడీ ఇదే విషయాన్ని మే2వ తేదీన కేబినెట్ మీటింగ్ అనంతరం ప్రజలకు చెప్పనున్నారు. వాస్తవానికి కొన్ని రోజులుగా ఇస్తున్న సడలింపులు కూాడా లాక్ డౌన్ ఎత్తివేసే దిశగానే ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది.