మహేష్ దమ్మెంతో చూడాలిప్పుడు..

July 16, 2020

సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’ తొలి రోజు వసూళ్ల మోత మోగించేసింది. అతడి డే-1 రికార్డులన్నింటినీ బద్దలు కొట్టేస్తూ రూ.34 కోట్ల దాకా వరల్డ్ వైడ్ షేర్‌తో ఈ చిత్రం సంచలనం సృష్టించింది. ఈ వసూళ్లు చూసి మహేష్‌ ‘సూపర్ స్టార్’ హోదాకు తగ్గవాడే అని అభిమానులు మురిసిపోతున్నారు. ఐతే తొలి రోజు ఈ చిత్రానికి చాలా అంశాలు కలిసొచ్చాయి. ముందు వారాల్లో ఉన్న సినిమాల థియేట్రికల్ రన్ పూర్తయి గ్రౌండ్ ఖాళీగా ఉన్న టైంలో.. అందులోనూ సంక్రాంతి సీజన్లో.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని మెజారిటీ థియేటర్లలో ఈ సినిమాను నింపేశారు. పైగా రెండు చోట్లా అదనపు షోలు పడ్డాయి. టికెట్ల రేట్లు కూడా పెరిగాయి. ఈ లెక్కన చూస్తే రూ.34 కోట్ల షేర్ ఫిగర్ మరీ గొప్పేమీ కాదు. నిన్న ‘అల వైకుంఠపురములో’ రిలీజ్ సందర్భంగా ‘సరిలేరు..’కు స్క్రీన్లు, షోలు బాగా తగ్గాయి. వసూళ్ల మీద కూడా ప్రభావం పడింది. కాబట్టి డే-2 ఫిగర్స్ ఎలా ఉంటాయన్నది కీలకం.

‘అల వైకుంఠపురములో’కు ‘సరిలేరు..’తో పోలిస్తే చాలా మంచి టాక్ వచ్చింది. సంక్రాంతి విజేత ఆ చిత్రమే అనడంలో సందేహమే లేదు. ఈ సీజన్లో ఒక ఫ్యామిలీ ఒక సినిమా మీద మాత్రమే ఖర్చు పెడుతుంది. రెండు సినిమాలు చూడదు. యూత్ మాత్రమే అలా చూస్తారు. ఈ నేపథ్యంలో ఫ్యామిలీస్ ఎక్కువగా ‘అల..’ సినిమానే ఎంచుకుంటాయనడంలో సందేహం లేదు. కాబట్టి సోమవారం నుంచి ‘సరిలేరు..’ కంటే ‘అల..’కే ఎక్కువ వసూళ్లు వచ్చే అవకాశముంది. ఈ పరిస్థితుల్లో మహేష్ మూవీకి బ్రేక్ ఈవెన్ కూడా కష్టమే అవుతుంది. ఆ సినిమా రూ.100 కోట్లకు పైగా షేర్ సాధిస్తేనే బయ్యర్లు బయటపడతారు. ఎంత సంక్రాంతి సీజన్ అయినప్పటికీ ఈ ఫిగర్ అంత వీజీ కాదు. కాబట్టి మహేష్‌ బాక్సాఫీస్ దగ్గర గట్టి పరీక్షే ఎదుర్కోబోతున్నాడు. తన సూపర్ స్టార్ హోదా నిలబడాలంటే కాస్త కఠినమైన ఈ పరిస్థితుల్లోనే అతను తన బాక్సాఫీస్ పవర్ చూపించాలి. చూద్దాం మరి ఏమవుతుందో?

Read Also

కష్టపడి పని చేశాక.. పార్టీ ఎంతగా చేసుకోవాలో చెప్పేసింది
‘అల వైకుంఠపురములో’ రివ్యూ
రాసలీలల కేసు - పృథ్వి అడ్డంగా బుక్ అటగా...