మందు బాబుల డైలాగ్... ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది

August 11, 2020

కేంద్రం రివర్సులో ఆలోచించి కొంప ముంచిందని మందుబాబులు దేశ వ్యాప్తంగా ఆవేదన చెందుతున్నారు. మందు బందు చేసి మమ్మల్ని అన్యాయం చేశారని... మా కంటే ఎక్కువ మీకే అన్యాయం జరిగిందని వారు అంటున్నారు. మందుకు సంబంధించి అనేక జోకులు పేలాయి. కానీ తాజాగా ఒకటి ఇంటర్నెట్ ని ఊపేస్తోంది... కేంద్రం కార్మికులను ఎక్కడికక్కడే ఉంచి ఎంత తప్పు చేసిందో వైన్స్ మూసి అంతే తప్పు చేసిందంటున్నారు వాళ్లు... తాజాగా అల వైకుంఠపురంలో డైలాగుతో వారు ఒక విచిత్రమైన సత్యాన్ని చెప్పారు. 

దేశంలో ఏ రాష్టానికైనా లాభం వచ్చేవి ఏవైనా ఉన్నాయి అంటే అవీ రెండే రెండు..

1.మద్యం

2.పెట్రోల్, డీజల్

మొదటిది ఇప్పట్లో ఓపెన్ చేయరు,రెండవది ఓపెన్ చేసిన తిరిగేదేమి లేదు కాబట్టి ఒరిగేదేమీ ఉండదు. 

ఇది ప్రభుత్వం చేసిన బుద్ధి తక్కువ పని అని... వైన్స్ ఓపెన్ చేస్తే చక్కగా బయట తిరక్కుండా తాగి తొంగొనేవాళ్లమని... మేము బయట తిరక్కుండా ఇంట్లో ఉండాాలి అంటే ఓపెన్ చేయాల్సింది పెట్రోలు బంకులు కాదు, వైన్  షాపులు అంటున్నారు మందుబాబులు. బయట తిరగొద్దంటారు పెట్రోలు ఎందుకు అమ్ముతారు? ఇంట్లో ఉండమంటారు మందు ఎందుకు అమ్మరు అని వారు ప్రశ్నిస్తున్నారు.

ఎవరూ కొనని పెట్రోల్ అమ్మే బదులు మందు అమ్మి దాని మీద వచ్చిన ఆదాయంతో కరోనా బాధితులను ఆదుకోవడానికి డబ్బులు అయినా వచ్చేవి కదా అంటున్నారు.