ఢిల్లీ భయపడింది

August 11, 2020

అవును మందుబాబుల దెబ్బకు ఢిల్లీ భయపడింది. ఢిల్లీలో ఒక విచిత్రమైన పరిస్థితి ఉంటుంది. పోలీసులు కేంద్రం కింద ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వానికి వారు జవాబుదారీ కాదు. దీంతో ఓపెన్ చేసిన లిక్కర్ షాపులకు జనం విపరీతంగా తరలివచ్చారు. అందరూ దీనిపై ఆందోళన వ్యక్తంచేశారు. ఈ సమయంలో వీటిని ఓపెన్ చేయడంపై విమర్శలు వచ్చాయి. ఇప్పటికే విపరీతంగా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఢిల్లీ  సీఎం కేజ్రీవాల్ భయపడ్డాడు. కానీ ఆయన చేతిలో పోలీసులు లేరు. కేంద్రానికి దీనిపై అభ్యర్థించడంతో నగరంలో రద్దీ ఉన్న చోట్ల దుకాణాలు మూసేశారు. 

సామాజిక దూరం పాటించేలా యజమానులు ఏర్పాట్లు చేయకపోతే అసలు దుకాణం తెరవద్దని చెప్పారు. ముఖ్యంగా ఈస్ట్ ఢిల్లీ మొత్తం మూసేశారు. అయితే...పోలీసుల వెర్షన్ ఎలా ఉందంటే... దుకాణాలు ఓపెన్ చేస్తున్నట్లు మాకు సమాచారమే లేదన్నారు. దుకాణాలేమో కేజ్రీవాల్ కిందకు వస్తాయి. కానీ పోలీసింగ్ సెంట్రల్ ది. చివరకు మూయడం అయితే జరిగింది. వాస్తవానికి అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. దేశ వ్యాప్తంగా దీనిపై హాహాకారాలు చేస్తున్నారు సామాన్యులు. వైన్ షాపులు మూయడమే మంచిది లేకపోతే ఇవి మరింత ప్రమాదానికి కారణం అవుతాయంటున్నారు.