టాటా తర్వాత మరో అతిపెద్ద విరాళమిదే

August 10, 2020

టాటా గ్రూపు నుంచి 1500 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చి రతన్ టాటా అపుడు ఇపుడు అసలైన ఇండియా ఆత్మగల కంపెనీ తనదే అని నిరూపించుకున్నారు. ఆయన దాతృత్వం అందరినీ మెస్మరైజ్ చేశారు. ఆయన ప్రకటనతో విరాళాల సంఖ్య భారీగా పెరిగింది. అప్పటిికి ఇంకా పెద్దగా విరాళాలు ఎవ్వరూ ప్రకటించకపోవడంతో టాటా అంతకాకపోయినా తాము కూడా గట్టిగానే ఇవ్వాలని చాలామంది అనుకున్న దానికంటే ఎక్కువగా ఇచ్చారు.

ఈ నేపథ్యంలో మరో కార్పొరేట్ సంస్థ ధారాళంగా తన మనసు చాటుకుంది. విప్రో అధినేత అజీమ్ ప్రేమ్ జీ విప్రో నుంచి, అజీం ప్రేమ్ జీ ఫౌండేషన్ నుంచి భారీ ఎత్తున విరాళం ప్రకటించారు. కరోనా కట్టడి కోసం తన గ్రూపు నుంచి 1125 కోట్లు విరాళం ప్రకటించాడు. అయితే, ఈయన భారత ప్రభుత్వ సహాయనిధికి కాకుండా కరోనాపై పోరాడుతున్న వైద్య, సేవా సిబ్బంది కోసం దీనిని కేటాయించారు. 

ఈ కార్యక్రమం నిర్వహణ కోసం ఒక వ్యవస్థను ఏర్పాటుచేస్తున్నారు. అందులో అజీం ప్రేమ్ జీ ఫౌండేషన్ కు చెందిన 1,600 మంది వైద్య బృందం, 350 మందికి పైగా పౌర సమాజ భాగస్వాములు పనిచేస్తారు. క్షేత్ర స్థాయిలో అవసరమైన చర్యలు చేపట్టడం, బాధితులకు సహాయం అందించడం, వైద్య సదుపాయాల అభివృద్ధి, చికిత్స, కరోనా నియంత్రణ కార్యక్రమా కోసం ఈ వ్యవస్థ పనిచేస్తు ఈ నిధులను వాడుకోనుంది. సంబంధిత ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుని దీనిని నిర్వహిస్తారు. ఇంత పెద్ద మనసు కలిగిన అజీమ్ ప్రేమ్ జీకి మనం జోహార్లు చెప్పకతప్పదు.