WETA for NRI : మహిళల కోసం మహిళల సంస్థ

August 07, 2020

ఘ‌నంగా జరిగిన WETA ప్రారంభోత్సవం

ముఖ్య అతిథిగా హాజరైన ఒక‌ప్ప‌టి హీరోయిన్‌, ఎంపీ సుమలత

“ తెలుగు మ‌హిళ‌ల కోటా.. స్త్రీ ప్ర‌గతి ప‌థ‌మే మా బాట‌” అనే నినాదంతో.. మ‌హిళ‌లే త‌మ‌కు ఏర్పాటు చేసుకున్న సంస్థ వేటా. తెలుగు నేల‌కు చెందిన హనుమండ్ల ఝాన్సీ రెడ్డి సార‌ధ్యంలో మ‌హిళా సాధికార‌తే ల‌క్ష్యంగా మ‌హిళ‌లతోనే ఈ సంస్థ‌ను ఏర్పాటు చేశారు. ఉమెన్ ఎంప‌వ‌ర్ మెంట్ తెలుగు అసోసియేష‌న్‌…(WETA). మొట్టమొదటి సారిగా అమెరికాలో మహిళలకోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదిక ఇదే. సంస్థ‌ ఛైర్మన్ ఝాన్సీ రెడ్డి మహిళా హక్కుల పరిరక్షణ, భద్రత, మహిళల అభివృద్ధి కోసం.. విన్నూత ఆలోచనతో ఈ వేదిక‌కు శ్రీకారం చుట్టారు.

మ‌హిళా సాధికార‌త దిశ‌గా అడుగులు వేసే క్ర‌మంలో స్వ‌శ‌క్తి దిశ‌గా మ‌హిళ‌ల‌ను ముందుకు న‌డిపించాలి.. ఈ నినాదంతోనే వెటా రంగంలోకి దిగింది. ప్ర‌స్తుతం అమెరికాలో తెలుగు వారి ఆధ్వ‌ర్యంలో కొన‌సాగు తున్న ప్ర‌ముఖ సంస్థ‌ల‌కు ఏమాత్రం తీసిపోని విధంగా.. మ‌హిళ‌ల‌కు అండాదండ‌గా నిలిచేలా వెటాను తీర్చిదిద్దేందుకు కంక‌ణం క‌ట్టుకున్నారు ఝాన్సీ రెడ్డి. WETA ప్రారంభోత్స కార్యక్రమం సెప్టెంబర్ 29 న గ్రాండ్‌గా జరగింది. WETA లాంచింగ్ సెరెమనీ మిల్పిటాస్‌లోని ఇండియన్ కమ్యూనిటీ సెంటర్‌లో అట్టహాసంగా నిర్వహించారు. ప్ర‌ముఖ క‌న్న‌డ సినీ హీరో అంబరీష్ సతీమణి, ప్రముఖ బహుబాష నటి, తెలుగింటి ఆడపడుచు, ఎంపీ సుమలత ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఒక మహిళగా, ప్రముఖ బహుబాష నటిగా, పార్లమెంట్ సభ్యురాలుగా.. అటు కళరంగంలోనూ.. ఇటు రాయాకీయంలోనూ తనదైన ముద్రను కనబరిచి .. ఉన్నత స్థాయిలో నివడానికి ఆమె రాణించిన విధానం గుర్తుచేసుకుంటూ సుమలతకి 'లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుస‌(జీవిత సాఫ‌ల‌య్య పుర‌స్కారం) ప్రదానం చేశారు. వేటా ప్రారంభోత్స కార్యక్రమంలో ప‌లు కళాత్మక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. సాయంత్రం జరిగిన బతు కమ్మ సంబరాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ వేడుకలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని.. రంగు రంగుల పూలతో బతుకమ్మలు పేర్చి ఆడి పాడారు. సింగర్ స్వాతి రెడ్డి బతుకమ్మ పాటలతో ఈ కార్యక్రమా న్ని హోరెత్తించారు.

ప్రపంచవ్యాప్తంగా తెలుగు మహిళల సాధికారతకు అంకితమైన WETA ప్రారంభోత్స కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి WETA టీమ్ ధన్యవాదాలు తెలిపింది. ఈ కార్యకమ్రంలో WETA స‌భ్యులు సుగుణ రెడ్డి, స్నేహ వేదుల‌, శైల‌జ క‌ల్లూరి, హైమ అనుమాండ్ల‌, అనురాథ ఎలిశెట్టి, రేఖ లేగ‌ల‌, ప‌ద్మిని క‌చ్చాపి, డాక్ట‌ర్ అభితేజ కొండా, జ‌య‌శ్రీ తెలుకుంట్ల పాల్గొన్నారు. అదేస‌మ‌యంలో ఎడిటింగ్ విభాగం నుంచి సాధ‌న శీలం స‌హా ప‌లువురు సేవ‌లందించారు.

https://www.youtube.com/watch?v=FW2m8VcGk0g&feature=youtu.be

https://www.youtube.com/watch?v=dfNhBKPvvwY&feature=youtu.be

https://www.youtube.com/watch?v=u9v8HZLMTZw&feature=youtu.be

https://www.youtube.com/watch?v=u9v8HZLMTZw