మోడీకి షాకింగ్ న్యూస్‌ - బాబుకి గుడ్ న్యూస్‌

January 27, 2020

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏపీ మ‌హిళ‌ల‌కు అందాల్సిన ప‌సుపు కుంకుమ డ‌బ్బులు అంద‌కుండా చేయ‌డానికి చేసిన కుట్ర‌లు అన్నీ ప‌టాపంచ‌లు అయ్యాయి. ఈసీకి రాసిన ప్ర‌తి లేఖ బ‌య‌ట‌పెట్టే వైసీపీ పార్టీ... పసుపు కుంకుమ డ‌బ్బులు ఆప‌మ‌ని రాసిన లేఖ‌ను మాత్రం ర‌హ‌స్యంగా ఉంచింది. త‌న స్వార్థం కోసం ఏపీ మ‌హిళ‌ల‌కు ద్రోహం చేయ‌డానికి జ‌గ‌న్ సిద్ధ‌మ‌యినా అది జ‌ర‌గ లేదు. మ‌హిళ‌ల‌కు మూడో విడ‌త అందాల్సిన 4 వేల రూపాయ‌ల చెక్ ప్ర‌జ‌ల‌కు రాకుండా అడ్డుకుందామ‌ని జ‌గ‌న్ వేసిన ప్లాన్ల‌ను ఈసీ ప‌టాపంచ‌లు చేసింది. వైసీపీ రాసిన లేఖ‌ను ప‌క్క‌న పెట్ట‌న ఈసీ ప‌సుపు కుంకుమ చెక్కులు ఎపుడో డిసైడ్ చేసిన‌వి, పైగా ఆల్రెడీ రెండు విడ‌తలు పంచారు కాబ‌ట్టి అది ఎన్నిక‌ల కోడ్ ఉల్లంఘ‌న కింద‌కు రాదు అని ఎన్నిక‌ల సంఘం వైసీపికి స్ప‌ష్టం చేసింది. దీంతో ఏపీ మ‌హిళ‌లు పండ‌గ చేసుకుంటున్నారు. త‌మ డ‌బ్బులు రాకుండా చేయ‌డానికి జ‌గ‌న్ చేసిన కుట్ర‌పై వారుమండిప‌డుతున్నారు.
ఇదిలా ఉండ‌గా... ఈరోజు మోడీకి కూడా ఈసీ షాకిచ్చింది. ఎన్నికలు త్వ‌ర‌లో జ‌రుగుతున్న నేప‌థ్యంలో నమో టీవీ చానల్ ఎలా ప్రారంభిస్తారంటూ ఈసీ మోడీని ప్రశ్నించింది. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నమో టీవీ ప్రారంభించడంపై ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. దీనిపై ఈసీ స్పందించింది. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖను వివరణ కోరింది. దూరదర్శన్ కు కూడా నోటీసులు జారీచేసింది. ఈ స‌మ‌యంలో ఆప‌ద్ధ‌ర్మ‌ ప్ర‌ధాని కార్యక్రమాన్ని ఎందుకు ప్రసారం చేయాల్సి వచ్చిందో చెప్పాలంటూ సంజాయిషీ కోరింది. దీంతో మోడీ బ్యాచ్ బిక్క‌చ‌చ్చిపోయింది.