8 మొగుళ్లను మేనేజ్ చేసింది, 9వ భర్త చేతిలో...

August 10, 2020

ఆమె కిలాడి, టక్కులాడి

ఎలా మేనేజ్ చేసిందో గాని 8 మంది మొగుళ్లను పెళ్లాడి వదిలేసింది

తొమ్మిదో సారి మరొకడిని పెళ్లాడింది... తర్వాత ఏమైంది? తెలుసుకుందాం

హైదరాబాదు శివారులోని పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో కర్నూలు జిల్లాకు చెందిన నాగరాజు ఉంటున్నాడు. అతను క్యాబ్ డ్రైవరు. స్థానికంగా నివసించే వరలక్ష్మి అతనికి దగ్గరైంది. దగ్గర్లోని పెట్రోల్ బంకులోనే ఆమె పనిచేస్తుంది. తరచూ నాగరాజుకు అక్కడకు రావడంతో ఇద్దరి పరిచయం చాలాదూరం వెళ్లింది. చివరకు వరలక్ష్మి భర్తను, కొడుకును వదిలేసి నాగరాజునే పెళ్లిచేసుకుని ఉండిపోయింది. 

తర్వాత వరలక్ష్మికి కొత్త పరిచయాలు ఏర్పడ్డాయి. అవి నాగరాజుకు తెలిసి నిలదీశాడు. ఏవేవో చెప్పింది. కానీ అలవాటు మానలేదు. దీంతో గొడవలు పెద్దగయ్యాయి. దీంతో గొడవ పెద్దది కావడంతో మంగళవారం భర్త నాగరాజు వరలక్ష్మిని చంపేశాడు. తనే పోలీసుస్టేషనుకు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా అనేక సంచలన విషయాలు బయటకు వచ్చాయి. 

వరలక్ష్మికి 30 ఏళ్లు. కానీ ఇప్పటికే 8 ఎనిమిది పెళ్లిళ్లు చేసుకుంది. నాగరాజు నెం.9 !!! ఆమెకు మగాళ్లంటే మోజు. కొత్త పరిచయాలంటే ఇష్టం. కొత్తవారిని పరిచయం చేసుకోవడం పెళ్లాడటం, మళ్లీ ఇంకొకరికి మనసివ్వడం పాత వాడితో విడిపోవడం... ఇదే తంతు. కానీ 8 పెళ్లిళ్లు ఎలాంటి వివాదాస్పదం కాలేదు. కానీ 9వ పెళ్లి పెటాకులు కావడం కాదు, ప్రాణాలే తీసింది. అతనే స్టేషనుకు వెళ్లి లొంగిపోయాడు అంటే ఎంత విసిగిపోయాడు. 

అసలు ఈ వరలక్ష్మి 100 ఏళ్లు బతికుంటే ఎన్ని పెళ్లిళ్లు చేసుకునేదో !! ఏది ఏమైనా హత్య నేరమే. 

Read Also

ఈటల షాకింగ్ వ్యాఖ్యలు... దేశమంతటా ఆశ్చర్యంగా చూస్తోంది
HYD: సర్కారు బడిని తనఖా పెట్టేసుకుని లోనిచ్చేసిన బ్యాంకు
ఉద్యోగం పోయిందని ఏడ్చేవాళ్లు సిగ్గుపడండి ఈ అమ్మాయిని చూసి