వైన్ షాపుల ముందు అమ్మాయిల క్యూ !

August 11, 2020

బయటకు తెలియడం లేదు గాని ఈ దేశంలో మహిళల్లో 30 శాతం మందికి పైగా మందు అలవాటు ఉంది. ఇటీవల అది బాగా పెరుగుతోంది. ఐటీ, సేవల రంగంలో ఉన్న మహిళలల్లో సోషల్ గ్యాదరింగ్స్ లో భాగంగా ఎక్కువ అలవాటు చేసుకుంటున్నారు. ఐటీలో టాప్ ఇండియాలో బెంగళూరు నగరమే. లాక్ డౌన్ మరోసారి పొడిగించడంతో రాష్ట్రాలకు వరుసగా ఆదాయం లేకపోతే కష్టం అని మందు అమ్ముకోవచ్చని కేంద్రం పేర్కొంది.

తాజాగా దేశంలో అత్యధిక రాష్ట్రాలు నేటి నుంచి మందు అమ్మకాలు మొదలుపెట్టాయి. దీంతో మందుబాబులు 40 రోజులు ఓపిగ్గా భరించి ఇపుడు వారి తాపత్రయం కట్టలు తెంచుకుంది. ఎక్కడ తమకు మందు దొరక్కుండా పోతుందో అని ఎగబడ్డారు. సామాజిక దూరం మరిచారు. అయితే... బెంగుళూరులో ఆసక్తికరమైన దృశ్యం కనిపించింది. వైన్ షాపు ముందు అమ్మాయిలు క్యూ కట్టారు. ఇపుడు ఈ ఫొటో వైరల్ అయ్యింది.