ఏపీలో మహిళలకు ప్రత్యేక చట్టం

August 08, 2020

అత్యాచారాలు, వేధింపుల నుంచి ఏపీలో మహిళలకు మరింత రక్షణ లభించనుంది. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడేవారికి వెంటనే శిక్ష విధించేలా చట్టాన్ని సవరిస్తూ చేసిన ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

కొత్త చట్టం ప్రకారం అత్యాచార కేసుల్లో వారం రోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేయాలని, అత్యాచార కేసుల్లో 21 రోజుల్లోనే తీర్పు వెలువడేలా నిబంధనలు రూపొందించారు. అయితే, పక్కా ఆధారాలు ఉన్నవాటిలోనే ఇది అమలువుతంది. ఈ చట్టం సరిగ్గా అమలుచేయడానికి అత్యాచార కేసులకు, సోషల్ మీడియా వేధింపుల కేసులకు, చిన్నపిల్లలపై అఘాయిత్యాల కేసులకు వెంటనే న్యాయం జరిగేలా ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని ఈ బిల్లులో పేర్కొన్నారు.

సోషల్ మీడియా వేధింపులకు సంబంధించి మొదటిసారి తప్పుడు పోస్టుకు రెండేళ్లు జైలు శిక్ష పడుతుంది. రెండోసారి తప్పుడు పోస్టింగ్‌కు నాలుగేళ్ల జైలు శిక్ష ఉంటుంది. చిన్నారులను లైంగికంగా వేధిస్తే ఏడేల్ల వరకు జైలు శిక్ష ఉంటుంది. అయితే ఇప్పటివరకు చిన్నారుల విషయంలో గరిష్ట శిక్ష ఐదేళ్లు. ఇపుడు అది ఏడేళ్లకు పెరిగింది.