స్వేచ్ఛా సంకెళ్ళ దినోత్సవం

August 05, 2020

నేడు ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం. 1991 సంవత్సరంలో ఆఫ్రికాలోని పత్రికా విలేకరుల ఆలోచనకు అంకురార్పణ ఈ ప్రపంచ పత్రికా దినోత్సవం. ప్రపంచం మొత్తమ్మీద కొన్ని లక్షల పత్రికలు నడుస్తున్నాయి. వాటిలో ప్రాంతీయ,జాతీయ మరియు అంతర్జాతీయ పత్రికలు కలిగున్నాయి. ప్రతిరోజూ ప్రపంచవ్యాప్తంగా దాదాపు కొన్ని కోట్ల పత్రికలు ప్రింట్ అవుతూ ప్రజలకు వార్తలు నిరంతరంగా అందిస్తున్నాయి. భారతదేశంలోనే లక్ష మరియు తెలుగు రాష్ట్రాలలో 23 అధికారికంగా నమోదు కాబడ్డ పత్రికలు ప్రస్తుతం సరిగ్గా నడుస్తున్నాయా అంటే సమాధానం సంధిగ్ధమే.
కాలం కన్నా వేగంగా పరిగెడున్న నేటి జీవన విధానంలో వార్తల ప్రాముఖ్యత ఎంతో అవసరం. ఫోన్లో నే ప్రపంచాన్ని చూస్తున్న నేటి తరం పత్రికా వార్తలకు ఎంత వరకు ఆదరిస్తారో మనం ఆలోచించక్కరలేదు. పోనీ ఆదరించినా పాఠకులను నిలబెట్టుకోవడం కత్తి మీద సాములాంటిది. అలా అని పాఠకులు ఆదరించినా పాలక ప్రతిపక్షాల నలిగిపోతుంది ప్రస్తుత పత్రికా మాధ్యమం. నేడు వార్తలకు విలువ లేదు, ఎందుకంటే ఆ వార్తలను అందించే విలేకరులకు స్వేచ్ఛలేదు. అంతేకాక రేసుగుర్రంలా దూసుకెళ్తున్న సాంకేతిక పత్రికను కనుమరుగు చేస్తోందన్నది సవివర వాస్తవం. మరి నేడు పత్రికా స్వేచ్ఛాదినోత్సవం అనాలా లేక స్వేచ్ఛా సంకెళ్ళ దినోత్సవం అనాలా.

ఇట్లు...మీ విషయ విమర్ళకుడు

 

RELATED ARTICLES

  • No related artciles found