రామాయ‌ణం సీరియ‌ల్ రికార్డు కొట్టింది

August 08, 2020

90ల్లో అశేష భార‌తీయ టీవీ ప్రేక్ష‌కుల‌నూ మంత్ర ముగ్ధుల్ని చేసిన సీరియ‌ల్ రామాయ‌ణం. దూర‌ద‌ర్శ‌న్‌లో ప్ర‌సార‌మైన ఈ సీరియ‌ల్ అప్ప‌ట్లో టీవీ ఉన్న ప్ర‌తి ఇంట్లోనూ ప్రేక్ష‌కుల్ని క‌ట్టి ప‌డేసింది. లాక్ డౌన్ కార‌ణంగా నెల‌న్న‌ర రోజులుగా జ‌నాలు ఇంటి ప‌ట్టునే ఉండ‌టంతో ప్ర‌సార భార‌తి మ‌రోసారి ఆ సీరియ‌ల్ దుమ్ము దులిపింది. దూద‌ర్శ‌న్‌లో గ‌త నెలలో ఈ సీరియ‌ల్‌ను పునఃప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు కూడా టీవీ ప్రేక్ష‌కులు ఆ సీరియ‌ల్ ప‌ట్ల అంతే ఆస‌క్తితో ఉన్నార‌న‌డానికి దీనికి వ‌చ్చిన రికార్డు టీఆర్పీనే నిద‌ర్శ‌నం. గ‌త నెల 16వ తేదీన దూర‌ద‌ర్శ‌న్‌లో మ‌హాభార‌తం సీరియ‌ల్‌ను రికార్డు స్థాయిలో 7.7 కోట్ల మంది చూశారు. 

ప్ర‌పంచంలో మ‌రే టీవీ సీరియ‌ల్‌ను కానీ, షోను కానీ ఒక్క రోజులో ఇంత‌మంది వీక్షించ‌లేదు. హాలీవుడ్ ప్రోగ్రాంల‌ను కూడా మ‌హాభార‌తం త‌ల‌ద‌న్నే స్థాయిలో వ్యూయ‌ర్‌షిప్ సంపాదించింది. ప్ర‌ముఖ హాలీవుడ్ షో గేమ్ ఆఫ్ థ్రోన్ ఒక్క రోజులో 1.85 కోట్ల వ్యూయ‌ర్ షిప్‌తో రికార్డు నెల‌కొల్ప‌గా.. షిప్ ది బిగ్ బ్యాంగ్ థియ‌రీ 1.7 కోట్ల వీక్ష‌ణ‌ల‌తో రెండో స్థానంలో ఉంది. రామాయ‌ణం వాటికి ఎన్నో రెట్ల వ్యూయ‌ర్‌షిప్‌తో వ‌ర‌ల్డ్ రికార్డు సాధించింది. లాక్ డౌన్ కొన‌సాగుతుండ‌టంతో డీడీ నేష‌న‌ల్‌లో మ‌హాభార‌తం సీరియ‌ల్ ప్ర‌సారాన్ని కొన‌సాగిస్తున్నారు. భార‌తీయులు అత్యంత మెచ్చిన క‌థ అయిన మ‌హాభార‌తం మీద ఇప్ప‌టికే ఎన్నో సినిమాలు వ‌చ్చాయి. వాటిని మించేలా భారీ స్థాయిలో సినిమాలు తీసేందుకు మ‌రింద‌రు స‌న్నాహాలు చేస్తున్నారు. మ‌న ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి సైతం మ‌హాభారతాన్ని సినిమాగా తీయాల‌న్న క‌ల‌త ఉన్న సంగ‌తి తెలిసిందే.