ఈ లోక్ సభ ఎన్నికల గురించి ఒక పచ్చి నిజం

June 02, 2020

2019 సార్వత్రిక ఎన్నికలు చేసిన రచ్చ అంతా ఇంత కాదు. ఒకరకంగా బెస్ట్ వరస్ట్ ఎన్నికలుగా నిలిచిపోయాయి ఇవి. దేశంలో ఇప్పటిదాకా జరిగిన అన్ని ఎన్నికల్లోకి ఇవే స్పెషల్. కాకపోెతే నెగెటివ్ కోణంలో ప్రత్యేకం. మద్యం, డబ్బు ప్రమేయం సాధారణం నుంచి అసాధారణ స్థాయికి చేరుకుంది ఈసారి. రికార్డు స్థాయిలో ఓటర్లు పోలింగ్ బూత్ లకు రావడానికి ఇది కూడా ఒక కారణం. మరి ఆ డబ్బు ఓటర్లను ఏ వైపు ప్రభావితం చేసిందో తెలియదు గాని... వారితో ఓటు అయితే వేయించింది.
ఈ ఎన్నికల్లో ఓటర్లకు పంచే తాయిలాలు కేవలం ఎన్నికల సంఘానికి చిక్కినవే 3 వేల కోట్లు. అంటే సాధారణంగా ఎన్నికల సంఘం పట్టుకునేవి చాాలా తక్కువ సంఖ్యలో ఉంటుంది. ఎందుకంటే జనం సహకరిస్తున్నపుడు అభ్యర్తులకు డబ్బు పంచడం పెద్ద కష్టం కాదు. అందుకే అన్ని కంప్లయింట్లు వస్తాయి గాని సామాన్య జనం నుంచి ఓటుకు నోటు కంప్లయింట్ రాదు. పోలింగ్ ముగిసే నాటికి అధికారులకు పట్టుబడిన తాయిలాలు అక్షరాలా... రూ.3,456 కోట్లు అయితే... దొరకనిది లక్ష కోట్లు పై మాటే అనుకోవాలి. 543 నియోెజకవర్గాల్లో అందరు అభ్యర్థులు కలిసి యావరేజిన 50 కోట్లకు పైగా ఖర్చుపెడతారు. ఇది తక్కువలో తక్కువ.
ఇటీవల తమిళనాడులో ఒక డీఎంకే అభ్యర్థి వద్దే 10 కోట్లు దొరికిందంటే... ఇక పరిస్థితి ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇపుడు 3 వేల కోట్లు నగదు పట్టుబడితే 2014 ఎన్నికల్లో పట్టుబడ్డ తాయిలాల విలువ కేవలం ఇందులో పది శాతం. అంటే 90 శాతం పెరిగాయి తాయిలాలు. అంటే ఏ స్థాయిలో ఓటర్లు - నాయకులు కుమ్మక్కయ్యారో చూడండి.