య‌తి.. హిమాల‌యాల్లో క‌నిపించాడ‌ట‌!

June 04, 2020

పురాణాల్లోనూ.. జాన‌ప‌ద క‌థ‌ల్లో మాత్రం క‌నిపించే య‌తి.. నిజంగానే ఉన్నాడా? ఇంత‌కాలం కాల్పనిక క్యారెక్ట‌ర్ కాస్తా.. క‌ళ్ల ముందు వ‌చ్చిందా? అంటే అవున‌ని చెబుతోంది భార‌త ఆర్మీ. భారీ శ‌రీరంతో భ‌యంక‌రంగా ఉండే మంచు మ‌నిషి.. ఇప్ప‌టివ‌ర‌కూ ఊహ‌ల్లోనే ఉండేవాడు. కానీ.. ఇప్పుడా మ‌నిషి నిజంగానే ఉన్నాడంటూ భార‌త ఆర్మీ చేసిన ట్వీట్ ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.
భూమి మీద య‌తి పాత్ర ఉంద‌ని చెబుతున్న భార‌త ఆర్మీ.. అత‌గాడి అడుగుల‌కు సంబంధించిన ఒక ఫోటోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. హిమాల‌యాల్లో సాహ‌స‌యాత్ర‌కు వెళ్లిన భార‌త సైనిక బృందానికి ఏప్రిల్ 9న మ‌క‌లు బేస్ క్యాంప్ స‌మీపంలో ఒక వింత మ‌నిషి ఆకారం క‌నిపించింద‌ని.. అత‌డ్ని య‌తిగా గుర్తించారు. ఈ వ్య‌క్తి పాద‌ముద్ర‌ల సైజు చూస్తే.. అవాక్కు అవ్వాల్సిందే.
ఎందుకంటే.. య‌తి పాద‌ముద్ర 32 అంగుళాల పొడ‌వు.. 15 అంగుళాల వెడ‌ల్పు ఉన్న‌ట్లు చెబుతున్నారు. ఇంత భారీ సైజులు పాద‌ముద్ర‌లు అంటే.. క‌చ్ఛితంగా య‌తివే అయి ఉంటాయ‌ని అంచ‌నా వేస్తున్నారు. గ‌తంలోనూ య‌తికి సంబంధించిన వార్త‌లు వ‌చ్చినా.. తొలిసారి.. పాద‌ముద్ర‌ల‌తో కూడిన ఫోటో ఇదేన‌ని చెప్పాలి. పాద‌ముద్ర‌ల‌తో య‌తి ఉంద‌ని చెబుతున్న భార‌త ఆర్మీ.. మ‌రిన్ని ఆధారాలు సేక‌రిస్తే బాగుంటుందేమో?

RELATED ARTICLES

  • No related artciles found