మళ్లీ అడ్డంగా బుక్కయిన వైసీపీ బ్యాచ్

July 09, 2020

వైసీపీ రంగుల పిచ్చి ఏపీలోనే కాదు దేశంలోనే చర్చనీయాంశం అయ్యింది. ఆ పార్టీ నేతల రంగుల పిచ్చి శ్మశానాల దాకా విస్తరించింది. దానికి అయితే నవ్వుకుని వదిలేశారు జనం. కానీ ఏకంగా జాతీయ జెండాను తీసి వైసీపీ రంగులు వేయడంతో దేశం మొత్తం రగిలిపోయింది. దెబ్బకు దిగొచ్చు మళ్లీ ఆ స్థానంలో జాతీయ జెండాను వేయించారు. అయినా.. పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకల దాకా పోదన్నట్టు... రంగుల పిచ్చి మాత్రం ఆగలేదు. మొన్న ఏకంగా నిబంధనలకు విరుద్ధంగా రోడ్ల డివైడర్లకు కూడా వైసీపీ రంగులు వేశారు. కానీ తాజాగా జాతిపితకే రంగులు వేశారు వైసీపీ బ్యాచ్.

ప్రముఖ జ్జాని, మేధావి అయిన మంత్రి బొత్స సత్యనారాయణ నియోజకవర్గంలో గాంధీ బొమ్మ దిమ్మెకు వైసీపీ మూడు రంగులు వేశారు. దీని గురించి పవన్ దాకా చేరడంతో ట్వీట్ చేస్తూ దానిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు పవన్. 

వైసీపీ రంగులతో మొన్న జాతీయ జెండా , ఈ రోజు గాంధీజీ,రేపు ఎవరు శ్రీ జగన్ రెడ్డి జీ ???

మొత్తానికి ఈ ఘటనతో మరోసారి వైసీపీ బ్యాచ్ అడ్డంగా బుక్ అయ్యింది. ఏకంగా జాతిపితను అవమానిస్తారా అంటూ అందరూ వైసీపీ నేతల తీరుపై విరుచుకుపడుతున్నారుు. ఇంత కామన్ సెన్స్ లేకుండా ఎలా ప్రవర్తిస్తున్నారు అంటూ జనం ప్రశ్నిస్తున్నారు. 

దీనిపై చంద్రబాబు కూడా తీవ్రంగా స్పందించారు. 

Not learning lessons after drawing flak for disrespecting the national tricolor,

@ysjagan ’s Govt is back to showing its true colors. In Vizianagaram Dist, the pedestal of Gandhiji’s statue has been painted in party colors again. Why this arrogance?   #YSRCPDisrespectsMahatma  
 
ఇది చంద్రబాబు ట్వీట్. గతంలో చేసిన తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకోకుడా తమ అసలు స్వరూపం చూపిస్తున్నారంటూ.... చంద్రబాబు విమర్శించారు.