అయ్యా జ‌గ‌న్ రెడ్డీ... ఈ హిస్ట‌రీ విన్నావా?

September 18, 2019

ఏపీలో చీమ చిటుక్కుమ‌న్నా... పుసుక్కున ఈసీ కి ఒక లెట‌ర్ ఇస్తుంది వైసీపీ. అదేంటో గాని దేశంలో ఎక్క‌డా ఏ పార్టీకి రానంత రెస్పాన్స్ ఎన్నిక‌ల సంఘం నుంచి వైసీపీకి వ‌స్తుంది. అది ఎంత వేగంగా వ‌స్తోందంటే... క‌స్ట‌మర్ కేర్‌లో సాల్వ్ చేసిన‌ట్టు గంట‌ల్లోనే వైసీపీకి స‌మాధానం ఇస్తోంది ఎన్నిక‌ల సంఘం. ఇందులో త‌ప్పేం లేదు గాని... ఇత‌ర పార్టీల‌కు కూడా ఇలాగే స్పందించాలి క‌దా అన్న‌ది ఇక్క‌డ అంద‌రూ కోరుకుంటున్న‌ది. ఉదా... తెలంగాణ‌లో కాంగ్రెస్ ఇచ్చిన విన‌తి ప‌త్రాల‌కు ఈసీ నుంచి స‌రైన స్పంద‌న కొర‌వ‌డింది. ఈ విష‌యంపై ఏకంగా కాంగ్రెస్ ప్ర‌వేశ‌పెట్టింది.

ఈ విన‌తిప‌త్రాల దాడిలో తాజాగా కేఏ పాల్ మీద ప‌డింది జ‌గ‌న్ పార్టీ. కేఏ పాల్ ఉద్దేశ పూర్వ‌కంగా త‌మ అభ్య‌ర్థుల పేర్ల‌లాగే వారి అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేశాడు అన్న‌ది వైసీపీ ఆరోప‌ణ‌. దానికి ఈసీ ఏం చేస్తుందో అర్థం కాదు. ఎందుకంటే ఎన్నిక‌ల నిబంధ‌న‌ల్లో ఎక్క‌డా సేమ్ పేరు ఉన్న‌వారు పోటీ చేయ‌కూడ‌ద‌ని నిబంధ‌న లేదు. అలాంట‌పుడు ఈ రిక్వెస్టుకు అస‌లు శాంక్టిటీయే లేదు. కాక‌పోతే వడ్డించేవాడు మ‌న వాడు అయితే ఏదో ఒక‌టి వ‌డ్డించ‌క‌పోతాడా అన్న‌ట్టు ఉంది వైసీపీ వ్య‌వ‌హారం. ఈరోజు మా అభ్య‌ర్థుల పేర్లు సేమ్ ఉన్నాయ‌ని ఏడుస్తున్న వైసీపీ గ‌తంలో 2009 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ తండ్రి చేసిన దుర్మార్గ‌పు ఆలోచ‌న‌ను మ‌రిచిపోతే ఎలా?
అప్ప‌ట్లో వైఎస్ ... ప్ర‌జారాజ్యం పార్టీని ఇబ్బంది పెట్ట‌డానికి ప్ర‌జారాజ్యం అభ్య‌ర్థుల పేర్ల‌లాగే ఉండే స్వ‌తంత్ర అభ్య‌ర్థుల‌ను బ‌రిలో దింపారు. దీనివ‌ల్ల పీఆర్పీ ఓట్లు చీల్చారు. ఆ నొప్పి ఏంటో ఈరోజు కొడుక్కి తెలుస్తోంది. మ‌రి ఈ బుద్ధి ఆనాడే ఉండాలి. ఇదంతా ఓకే... ఈ విన‌తిని ఈసీ ఎలా ప‌రిశీలిస్తుంది అన్న‌దే చూడాలి.

కింద లిస్టు చూడండి. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి పీఆర్పీపై చేసిన ప్ర‌యోగం. తండ్రి త‌ప్పు కొడుక్కి శాపం.