చంద్రబాబు ఇలా చేసి ఉంటే... ఎంత రచ్చ చేసేవారో

February 27, 2020

చంద్రబాబు హయాం నడుస్తుంటే మేధావుల కళ్లన్నీ బాబు మీదే ఉంటాయి. ప్రతి ఒక్కరు ప్రభుత్వంలో జరిగినవన్నీ వదిలేసి జరగని వాటి గురించి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తారు. ఒక ఇంట్లోనే రకరకాల వ్యక్తులుంటారు. మరి ఒక పార్టీలో ఉండరా... కచ్చితంగా ఉంటారు. అది ఒక పార్టీకి సంబంధించిన సమస్య కాదు. అన్ని పార్టీల సమస్య. కానీ... అలాంటి తప్పులు జరిగినపుడు చంద్రబాబు విపరీతంగా బ్లేమ్ అవుతుంటారు. కానీ అంతకంటే ఘోరమైన తప్పులు ఇతర ప్రభుత్వాల్లో జరిగితే ఎవరూ నోరు మెదపరు.  మిగతా వాళ్ల సంగతి వేరు. 

కానీ చంద్రబాబు రాజకీయ పోరాటాలు తేలిపోతున్నాయి. అధికార పార్టీ ఘోరాలు చేస్తున్నా కూడా, అవకాశాలు ఇచ్చిన కూడా తెలుగుదేశం పార్టీ వాటిని దొరకబుచ్చులేకపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఆఫీసులకు వైసీపీ రంగులు వేస్తున్నా... టీడీపీ సోషల్ మీడియాలో మాత్రమే ప్రశ్నిస్తోంది. సరే రంగులు వేయడం వరకు ఓకే. కానీ కొన్ని చోట్ల పంచాయతీ కార్యాలయాలను వైసీపీ ఆఫీసులను చేసి పడేసింది. అయినా తెలుగుదేశం పార్టీ నిమ్మకునీరెత్తినట్టు ఉంటుంది. ఇదే తప్పు టీడీపీ చేసి ఉంటే... రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబును వైసీపీ ఇరికించేది. కానీ వైసీపీ విషయంలో కోర్టుకెళ్లడం కాదు కదా కనీసం కొన్ని సార్లు విమర్శ కూడా చేయలేకపోతోంది. గతంలో టీడీపీలో ఉన్న ఫైర్ ఉన్న యువత నేడు లేదు. వైసీపీలో అభిమానులు పార్టీ కోసం ఎంత కైనా తెగించేవారు. కానీ టీడీపీలో అలాంటి వారు బాగా కరవవుతున్నారు. అందుకే వైసీపీ తప్పులను ఎత్తిచూపి ప్రచారం చేసే వారు కూడా బాగా తగ్గిపోతున్నారు. అక్కడక్కడా ఉన్న కొందరు టీడీపీ హార్డ్ కోర్ సైనికులు కొన్ని చంద్రబాబు అలసత్వాన్ని తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. 

తాజాగా ఒక ఉదాహరణ చూద్దాం. శ్రీకాకుళం జిల్లాలోని ఒక పంచాయతీ కార్యాలయానికి వైసీపీ రంగులు వేశారు. అక్కడివరకు అయితే పర్లేదు. కానీ ఆఫీసు మొత్తం వైసీపీ జెండాలతో నింపేసింది. కానీ దీనిపై టీడీపీ పెద్దగా విమర్శలు కూడా చేసింది లేదు. వాస్తవానికి దీనిని కోర్టుకు వేస్తే కచ్చితంగా ప్రభుత్వానికి అక్షింతలు తప్పవు. అయినా కూడా ఎందుకో టీడీపీ అలసత్వం. ఇలాంటి తప్పులే ఎన్నికలు ముందు అనేకం చేసింది టీడీపీ. ఇతర కులాలతో కమ్మ కులాన్ని వేరు చేస్తూ జగన్ పన్నిన వ్యూహం అడ్డుకోవడానికి అవకాశాలున్నా తెలుగుదేశం వాడుకోలేకపోయింది. ఇటీవల టీడీపీ గవర్నమెంటు ఏ పోస్టు ఏ కులానికి ఇచ్చింది. వైసీపీ ఎవరికి ఇచ్చింది అంటూ... అంతా రెడ్లే అనే ఇమేజ్ క్యాంపెయిన్ చేసింది. కానీ గత టీడీపీ గవర్నమెంటులోనే వైసీపీ కాస్ట్ బ్లేమ్ మొదలుపెట్టినపుడు వైసీపీ కీలక పదవుల్లో ఎవరున్నారు, టీడీపీ కీలక పదవుల్లో ఎవరున్నారు అని ఆరోజు అడ్డుకుని ఉండాల్సింది. వైఎస్ ఎంత మంది రెడ్లకు అందలం ఇచ్చాడు. టీడీపీ ఎంత మంది కమ్మలకు అవకాశం ఇచ్చింది నిరూపించాల్సింది. కానీ ఆరోజు అబద్ధాలను ప్రచారం చేస్తుంటే అధికారం ఉండి కూడా అడ్డుకోవడంలో టీడీపీ విఫలమైంది. కానీ విపక్షంలో ఉన్న వైసీపీ తెలివిగా అవకాశాలను వాడుకుంది.

సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలు ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత చంద్రబాబు, పార్టీని విపరీతంగా బూతులు తిడుతున్నా టీడీపీ పట్టించుకోలేదు. కానీ ఇపుడు చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టాడు. వైసీపీ ఏమో ఏకంగా తమ పార్టీ వారిని బూతులు తిడుతున్నారు సోషల్ మీడియాలో అంటూ డీజీపీ కి కంప్లయింట్ చేసింది. మరి ఇలా ఏనాడూ చంద్రబాబును తిట్టినా ఎందుకు టీడీపీ స్పందించలేదు. ఆ ఫలితమే ఇప్పటి ప్రతిపక్ష ప్రాప్తి. ఇప్పటికీ ఒక విషయం బల్లగుద్ది చెప్పొచ్చు... అన్నిరకాల రాజకీయ మార్షల్ ఆర్ట్స్ లో, గెరిల్లా యుద్ధంలో ఆరితేరిన వైసీపీని ఎదుర్కోగల శక్తి ఇపుడు అయితే టీడీపీ లేదు లేదు లేదు.

Read Also

ఇమ్రాన్ పై పాక్ పత్రిక సంచలన కథనం
సమ్మె వేళ.. ప్రగతిభవన్ లో ఏం జరుగుతోంది?
చరిత్రను తవ్వి కేసీఆర్ ను కెలికిన పవన్