పలాసలో ఫ్యాన్ గాలి వీయట్లేదా? జగన్ ఎందుకు దిగుతున్నారు..?

July 20, 2019

ఆంద్రప్రదేశ్ లో ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఎన్నికల సంగ్రామంలో వ్యూహ, ప్రతి వ్యూహాలతో పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. అయితే పలు నియోజకవర్గాల్లో హోరా హోరీ పోరు ఉన్నప్పటికీ.. కొన్ని చోట్ల ఇప్పటికే వార్‌ వన్‌ సైడ్‌ గా మారింది. శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం పార్టీ కంచుకోట అయిన పలాస నియోజకవర్గంలోనూ ఇప్పటికే తుది ఫలితంపై దాదాపుగా నియోజకవర్గ ప్రజలు, రాజకీయ విశ్లేషకులు, జిల్లా లీడ‌ర్లు ఓ అంచనాకు వచ్చేసినట్టే కనపడుతోంది. టీడీపీ నుంచి పోటీ చేస్తున్న రాజకీయ వారసురాలు, జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గౌతు శిరీష విజయం లాంఛ‌నమే అంటున్నారు విశ్లేషకులు. గెలుపు తథ్యం కావడంతో అయితే ఎంత మెజారిటీతో గెలుస్తుందనే దానిపైనే అక్కడ చర్చలు సాగుతున్నాయి.

తిత్లీ ఎఫెక్ట్‌ తర్వాత నియోజకవర్గ జనాలు పార్టీలకు అతీతంగా మళ్ళీ గౌతు ఫ్యామిలీని గెలిపించుకుని వారి రుణం తీర్చుకుంటామని అంటున్నారు. ప్రతీ పల్లెతో పాటు, మారు మూల గ్రామాల్లో శిరీష అభ్యర్థిత్వాన్ని బలపరచడంతో పాటు గ్రామస్తులంతా ఆమెకు ఓట్లు వెయ్యాలని ఇప్పటికే డిసైడ్‌ అయిపోయారు. తిత్లీ తుఫాన్‌ సమయంలో తమ జీవితాలు సర్వనాశనం కాగా టీడీపీ అధినేత చంద్రబాబు, అయన తనయుడు లోకేష్‌తో పాటు గౌతు ఫ్యామిలీ అంతా నిద్రాహారాలు మాని మరీ పలాస నియోజకవర్గంలో ప్రజల బాగోగులు పట్టించుకుంటే.. వైసీపీ నేతలు కనీసం పలకరించిన పాపాన పోలేదన్న ఆవేద‌న ఇక్కడి ప్రజల్లో బలంగా ఉంది. దీంతో ఇప్పుడు వైసీపీ నాయకులూ ఏం ముఖం పెట్టుకుని ఓట్లు అడగడానికి వస్తున్నారని పలాస ప్రజానీకం విరుచుకుపడుతున్నారు. పలాస వైసీపీ నాయకుల ప్రచారానికి ఏ మాత్రం స్పందన లేకపోవడంతో ఏకంగా వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ నియోజకవర్గంలో ఈ నెల 23న వైసీపీ అభ్యర్థి అప్పలరాజుకు మద్దతుగా ప్రచారం చేసేందుకు వస్తున్నారు. ఇప్పటికే వైసీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌తో పాటు మరో రెండు ప్రైవేట్‌ సర్వేల్లో సైతం పలాసలో శిరీష గెలుపుకు బ్రేకులు వెయ్యలేమని తేలిపోయింది. వైసీపీలో ద్వితీయ శ్రేణి నాయకులు సైతం అప్పలరాజు గెలుపుపై నమ్మకం లేక విడతల వారీగా టీడీపీలోకి జంప్‌ చేసేస్తున్నారు. పలాస టీడీపీలో పొలిటికల్‌ తెర మీద శిరీష దూసుకుపోతుంటే ఆమె విజయానికి టీడీపీ నియోజకవర్గ కన్వినర్‌ యార్లగడ్డ వెంకన్న చౌదరి అదిరిపోయే వ్యూహాలతో ప్రత్యర్థులను ఉక్కిరిబక్కిరి చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే వైసీపీ అభ్యర్థి అప్పలరాజుపై అసహనంతో ఉన్న జగన్‌ నేరుగా తానే ప్రచారానికి దిగడం వెనుక ప్రధాన ఉద్దేశ్యం.. టీడీపీకి రాబోయే మెజారిటీని కాస్త తగ్గించడమే! అని పేర్కొంటున్నారు రాజకీయ విశ్లేషకులు.