టీడీపీని దెబ్బకొట్టబోయి దారుణంగా బుక్కయిపోయిన వైసీపీ

May 25, 2020

ఎలాంటి సందర్భాన్ని అయినా రాజకీయాలకు వాడుకునేలా వైసీపీ తన కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ ఏమైనా ఇచ్చిందా అన్నంత అనుమానం వస్తుంది వైసీపీ కార్యకర్తల వ్యవహార తీరు చూస్తుంటే. గతంలో హుదూద్ వైజాగ్ పై విరుచుకుడినపుడు విజయమ్మను ఓడిస్తారా.. మీకు జరగాల్సిందే అంటూ కొందరు వైసీపీ కార్యకర్తలు అప్పట్లో పోస్టులు పెట్టడంతో అది వైరల్ అయింది. విపరీతంగా విమర్శలు రావడంతో వెనక్కు తగ్గారు.

తాజాగా వైజాగ్ లో ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో గ్యాస్ లీకైతే టీడీపీ వాళ్లు చేసిన కుట్ర అంటూ మార్ఫింగ్ ఫొటోలతో ఫేక్ ప్రచారం మొదలుపెట్టారు వైసీపీ పేటీఎం బ్యాచ్. అయితే... ఈసారి కూడా వారి ఆటలు చెల్లలేదు. టెక్నికల్ గా సరైన అవగాహన లేక అడ్డంగా దొరికిపోయారు. narra srinivas chowdary అనే వ్యక్తి పేరిట ఒక ఫేక్ ట్వీట్ సృష్టించారు. అందులో ఏముందంటే... ‘‘దేవుడు ఉన్నాడురా, మా అమరావతి ప్రజల ఏడుపు తగిలే వైజాగ్ వాళ్లకి ఇలా జరుగుతుంది. ఇంకా జరగాలి, ఇంకా ఇంకా జరగాలి. రాజధానిగా అమరావతినే ఉంచేదాకా ఇలాంటివి జరుగుతూనే ఉండాలి‘‘ అని ఆ ట్వీట్ లో రాసి ఉంది. అంటే టీడీపీ వైజాగ్ వినాశంన కోరుకుంటుంది అని ప్రప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం. అయితే... ఈ మార్ఫింగ్ చేసిన వ్యక్తి అవగాహన లోపం వల్ల వెంటనే దీనిని కనిపెట్టారు.

వాస్తవానికి 15 అక్షరాల కంటే ఎక్కువ ట్విట్టరు యూజర్ నేమ్ లో వాడలేం. కానీ 21 అక్షరాల యూజర్ నేమ్ తో వారు ఫేక్ ట్వీట్ క్రియేట్ చేశారు. అసలు అది అసంభవం. గూగుల్ చేస్తే ఈ విషయం తెలిసిందే. ట్విట్టరులో @narrasrinivaschowdary యూజర్ నేమ్ తో అక్కౌంటే లేదు. క్రియేట్ కూడా చేయలేం. అది ట్విట్టరు అంగీకరించదు. 21 అక్షరాలు ఉండటమే దానికి కారణం. ఈ విషయాన్ని గమనించిన టీడీపీ కార్యకర్తలు కొందరు వైసీపీ బ్యాచ్ ను చీల్చి చండాడారు. మీ తరఫున మీరే శవ రాజకీయాలు చేస్తారు. టీడీపీ తరఫున కూడా మీరే శవరాజకీయాలు చేస్తారు. ఇంత వికృత బుద్ధి ప్రకృతి వినాశనానికి దారితీస్తుంది జాగ్రత్త అంటూ హెచ్చరించారు. ఇలాంటి ఫేక్ ట్వీట్లు ఇంకొన్ని కూడా క్రియేట్ చేశారు.

వాస్తవానికి వైజాగ్ ప్రజలకు రాజధానిపై ఆసక్తి లేదు. మరోవిషయం... రాజధాని ప్రజలు వైజాగ్ వారిని ఏం వ్యతిరేకించడం లేదు. వారు జగన్ ను మాత్రమే వ్యతిరేకిస్తున్నారు. అసలు ఇది జగన్ తీసుకున్న నిర్ణయం అయితే... అమరావతి ప్రజలకు వైజాగ్ మీద ఎందుకు కోపం ఉంటుంది. వైజాగ్ లో మెజారిటీ ప్రజలు అమరావతికే మద్దతు పలికారు. అది కూడా బహిరంగ వేదికలపై మద్దతు పలికారు. ఎలాగైనా టీడీపీని డ్యామేజ్ చేయాలన్న క్రమంలో తమ వికృత బుద్ధిని బయటపెట్టుకున్న వైసీపీ బ్యాచ్ ను జనం నోటికి వచ్చినట్లు తిడుతున్నారు. ఒక వైపు చంద్రబాబు తెలుగుదేశం కేడర్ ను వెంటనే సహాయకకార్యక్రమాల్లో పాల్గొనాలి అని పిలుపునిచ్చి... స్వయంగా చంద్రబాబు వైజాగ్ కు వెళ్తుంటే... వైసీపీ నేతలు ఇలా మూర్ఖంగా ప్రచారం చేస్తున్నారు.

వైజాగ్ లో టీడీపీకి గట్టి పట్టుఉండటం వల్ల వారి దృష్టిలో చంద్రబాబును బ్యాడ్ చేయాలి అనేది వైసీపీ బ్యాచ్ ఉద్దేశం. అందరూ వైజాగ్ కోసం ప్రార్థిస్తున్న సమయంలో ఇలాంటి శవ రాజకీయాలు చేస్తే నాశనం అయ్యేది వైసీపీయే. అది గుర్తుంచుకోవాలి.