ఎమ్మెల్యే రోజాపై వైసిపి కార్యకర్తలు దాడి!

August 03, 2020

ఏపీఐఐసీ చైర్మన్, ఎమ్మెల్యే రోజాపై దాడికి యత్నించారు వైసిపి కార్యకర్తలు. కె బిఆర్ పురం గ్రామ సచివాలయం భూమి పూజ కి వెళ్ళిన సమయంలో గ్రామంలోకి ప్రవేశించకుండా ఓ వర్గం వైసీపీ నేతలు ఆమెను అడ్డుకున్నారు. కారు అద్దాలు ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు . పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు దీంతో పరిస్థితి సద్దుమణిగింది. అయితే తమ పార్టీకి చెందిన నేతలు కొందరు దాడి చేయించారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన రోజా ఈ విషయాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తీసుకెళ్తానని పేర్కొన్నారు. వైసీపీ కార్యకర్తలపై కేసులు పెట్టిన ఎమ్మెల్యే రోజా వైసీపీ కార్యకర్తలపై కేసులు పెట్టిన ఎమ్మెల్యే రోజా అంతేకాదు తనపై దాడికి ప్రయత్నించిన వారిని ఉపేక్షించబోమని చెప్పిన రోజా వారిపై కేసులు నమోదు చేశారు. రోజా పై దాడి యత్నం ఘటన వైసీపీలో చినికి చినికి గాలివానగా మారుతోంది. సొంత పార్టీ కార్యకర్తలపైనే ఎమ్మెల్యే కేసులు పెట్టే వరకు వెళ్లింది. రోజా ఫిర్యాదుతో పుత్తూరు పోలీస్ స్టేషన్‌లో పలువురు వైసీపీ కార్యకర్తలపై కేసు నమోదైంది. కేబీఆర్‌పురంలో గ్రామ సచివాలయ భూమిపూజకు వెళ్లిన సమయంలో సురేష్, రిషేంద్ర, అంబు, సరళ, రామ్మూర్తి,హరీష్, సంపత్ తనపై దాడికి యత్నించారని రోజా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో 143,341,427,506, 509 రెడ్ విక్, 149 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పుత్తూరు పోలీసులు. మొత్తానికి వైసిపి ఎమ్మెల్యేలకు సొంత నియోజకవర్గాల్లో సొంత పార్టీ కార్యకర్తల నుండి విముఖత వ్యక్తం కావడం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా చెప్పొచ్చు.