చంద్రబాబు ఇంటికెళ్లిన వైసీపీ ఎమ్మెల్యే

May 26, 2020

అవును.. వైసీపీ ఎమ్మెల్యే చంద్రబాబు ఇంటికి వెళ్లారు. కానీ చంద్రబాబును కలవడానికి కాదు. గత కొద్దిరోజులుగా దక్షిణాది మొత్తం వరదలు వచ్చి ప్రాజెక్టులు అన్నీ కళకళలాడుతున్నాయి. దీంతో ఏపీలో కూడా అన్ని ప్రాజెక్టులు నీటితో నిండిపోయి... కిందికి నీళ్లు పోతున్నాయి. తాజాగా పులిచింతల ప్రాజెక్టు కూడా నిండి దిగువకు నీరు వదులుతున్నారు. కృష్ణానదిలో వరద నీరు పెరగడంతో కరకట్టపైన చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేనిని గెస్ట్ హౌస్ ను వరద తాకింది. వరద నీరు చంద్రబాబు ఇంటి ఆవరణలోకి చేరింది. దీంతో అక్కడి పరిస్థితులను సమీక్షించడానికి స్థానిక ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి చంద్రబాబు ఇంటిని సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటిని కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని, దానికోసం తగిన చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే ఆర్కే అన్నారు. అయితే, వరద గురించి చంద్రబాబుకు ముందుగానే అర్థమై హైదరాబాదు చేరుకున్నారని, వారి వాహనాలను కూడా మరోచోటకు తరలించారని ఎమ్మెల్యే అన్నారు. వరద వల్ల ఆయన ఇంటికి ఏమీ కాకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.