రామ్మోహన్ నాయుడు అక్క... అసెంబ్లీలో సెంటరాఫ్ అట్రాక్షన్

February 25, 2020

టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని అసెంబ్లీలో ఆసక్తికరమైన చర్చకు కారణమయ్యారు. మద్య నిషేధం సరిగ్గా అమలు చేయడం లేదని ఆరోపించిన ఆమె... ప్రజా నివాసాల నుంచి మందుషాపులు, బార్లు తరలించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఉన్నవాటిని దూరంగా తరలించాలని కోరారు.

మందు బ్రాండ్లు కూడా కమిషన్ ఇచ్చే వాళ్లవే అనుమతిస్తున్నారని... ఆమె వివరించబోతుండగా మిగతా సభ్యులు అందరూ నవ్వడం మొదలుపెట్టారు. స్పీకర్ జోక్యం చేసుకుని... నీకెందుకు తల్లీ ఆ బ్రాండ్ల గోల మిగతా వాళ్లు మాట్లాడుతారులే వాటి గురించి అని సున్నితంగా సలహా ఇచ్చారు. సభ్యులతో పాటు ప్రస్తావన తెచ్చిన ఆదిరెడ్డి భవాని కూడా నవ్వుతూ కొద్దిసేపు మాట్లాడి ముగించారు. ఆ వీడియో దృశ్యమిదే.