ఔనప్పా... ఎక్కువప్పులు చేశాం- బుగ్గన తెగింపు

August 10, 2020

5 సంవత్సరాల్లో చంద్రబాబు ప్రభుత్వ లక్ష కోట్ల చిల్లర అప్పు చేసింది. అయితే... రెండున్నర లక్ష కోట్లు చెప్పినట్టు వైకాపా ఫుల్ గా ప్రచారం చేసింది. కానీ ఏనాడు చంద్రబాబు ప్రభుత్వం శ్వేతపత్రం రిలీజ్ చేసి దానిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. కట్ చేస్తే డబ్బులను ఏపీలో సర్కారు పప్పు బెల్లాల్లా పంచుతోంది. అన్నీ నగదు బదిలీ పథకాలే.. జనాలకు పథకాల పేరిట నేరుగా నగదు గుమ్మరించడం సంచలనం అవుతోంది. చివరకు సగం పథకాలు అమలు చేయడానికే సర్కారు దగ్గర డబ్బులు చాలలేదు. దీంతో జగన్ సర్కారు అప్పులపై పెద్ద ఎత్తున విమర్శలు మొదలయ్యాయి.

తాజాగా ఆర్ బీఐ విడుదల చేసిన నివేదిక ప్రకారం గత ఏడాదితో పోలిస్తే.. ఈ ఏడాది రెండు తెలుగు రాష్ట్రాలు భారీగా అప్పులు చేశాయట. తెలంగాణలో అప్పుల భారం 38 శాతం, ఆంధ్రప్రదేశ్ లో ఏకంగా 42 శాతం పెరిగిందట. గత ఏడాది దేశంలో అప్పుల జాబితాలో  తెలంగాణ తొమ్మిదో స్థానంలో,  తాజాగా ఆరో స్థానానికి ఎగబాకింది. ఆంధ్రప్రదేశ్ ఆరో స్థానం నుంచి 3వ స్థానానికి చేరుకుంది. అంటే పొద్దున లేస్తే అప్పు చేస్తున్నాయని...అర్థం.

దీనిపై విమర్శలు రావడంతో ఆర్థిక మంత్రి బుగ్గన స్పందించారు. మాజీ మంత్రి యనమల ఏదేదో మాట్లాడుతున్నాడు. అవన్నీ నిజం కావని అన్నారు. ఈ మాట అంటూనే బహిరంగ మార్కెట్లో ఎక్కువ అప్పు చేసిన మాట నిజమే అన్నారు. అన్నిపన్నుల ఆదాయం కేవలం లక్ష 14 వేల కోట్లు మాత్రమే వస్తోంది అన్నారు. మరి అలాంటపుడు 42 వేల కోట్లు జనాలకు పప్పు బెల్లాల్లా ఎలా పంచారన్న ప్రశ్నకు బుగ్గన సమాధానం చెప్పలేక నీళ్లు నములుతారు. పన్నుల ఆదాయం ప్రజలకు పంచితే నష్టం ప్రజలకే కదా. సమర్థుడైన ముఖ్యమంత్రి కొత్త ఆదాయాన్ని సృష్టించి ప్రజలకు మరిన్ని సదుపాయాలు కల్పించాలి గాని భూములు అమ్మి, అప్పులు తెచ్చి నగదు బదిలీ పథకాలు పెట్టడం ఏంటని తీవ్రవిమర్శలు వస్తున్నాయి. 

వీరు ఎంతకు తెగించారంటే... 73 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో బయట దేశాల్లో ట్రస్టుు, వ్యక్తుల నుంచి లోను తీసుకుంటాం పర్మిషన్ ఇవ్వండి అని అడిగిన ఏకైక సర్కారు జగన్ సర్కారే. అసలు ఈ ప్రతిపాదన పెట్టడానికి జగన్ కి ఎంత ధైర్యం అని ఇతర ప్రభుత్వాలు ఆశ్చర్యపోతున్నాయి. కేంద్రం దీనికి అనుమతి ఇవ్వదు. కానీ అసలు జగన్ చేసిన ఈ ఆలోచన అందరినీ విస్మయ పరుస్తోంది.

ఒక ప్రభుత్వానికి ఏ ధైర్యంతో ప్రైవేటు వ్యక్తి లేదా కంపెనీ అప్పు ఇస్తుందన్నది ఆశ్చ్యర్యకరం కదా. ఇన్ని విచిత్రాలు, సర్కస్ లు చేస్తూ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి పాత ప్రభుత్వంపై  పడుతున్నారు వైసీపీ సర్కారు పెద్దలు. పైగా అప్పులు చేసి ప్రభుత్వాన్ని నడుపుతున్నామని గర్వంగా ఒప్పుకుంటున్నారు. అది తమ అసమర్థత అనే విషయం కూడా వారికి అర్థం కాని పరిస్థితి.