ముస్లింలపై యోగి సంచలన వ్యాఖ్యలు

August 06, 2020

తొలుత నెమ్మదిగా ఉన్న కరోనా కేసులు యూపీలో ఇపుడు వేగంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం యూపీలో 2500 కేసులున్నాయి. తబ్లిగి జమాత్ కార్యకర్తల వల్లే ఉత్తర్ ప్రదేశ్ లో, దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగాయని... యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తబ్లిగి జమాత్ నేరానికి పాల్పడిందన్నారు. మొదట్లో వారు తప్పు ఒప్పుకుని అందరకి సందేశం పంపి ఉంటే... ఈపాటికే కేసులు తగ్గేవని యోగి అన్నారు.

తబ్లిగి జమాత్ నేరానికి పాల్పడిందని, తబ్లిగి జమాత్ సభ్యులు నేరస్థులు అని యోగి పేర్కొన్నారు. వారికి కరోనా సోకడం నేరం కాదని.... ఆ విషయం దాచిపెట్టి దేశ వ్యాప్తంగా కేసులు పెరగడానికి కారణం కావడం వారు చేసిన నేరమని... ఇది దేశ ఆర్థిక వ్యవస్థని మింగేసే స్థాయికి చేరిందని యోగి వ్యాఖ్యానించారు. 

వారు కరోనాను వ్యాపింపజేశారు. వారిపై కఠిన చర్యలు కచ్చితంగా తీసుకుంటాం. అందరినీ గుర్తిస్తున్నాం. తబ్లిగి జమాత్ కి సంబంధం ఉన్నవాళ్లు చాలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని అన్నారు. వారు కరోనా సోకిన విషయం దాచిపెట్టకుండా ఉంటే కరోనాను ఈ పాటికే నివారించే వాళ్లం అని యోగి వ్యాఖ్యానించారు.