కోడెల గొడవలో సైడైంది గానీ బీజేపీ జగన్ ను ఏకేసిందీరోజు

July 05, 2020

బీజేపీకి జ్జానోదయం పూర్తిగా అయ్యింది. వారు జగన్ నుంచి ఆశించినదానికి, జగన్ పాలనకు ఎంతో తేడా ఉంది. జగన్ ను గెలిపిస్తే బీజేపీ చెప్పినట్లు వింటాడని భావించి బీజేపీ ఆశలు అడియాశలయ్యాయి. జగన్ మాత్రం అవసరమైతే  మోడీ కాళ్ల మీద పడతా గానీ... నేను నా ఇగోను పక్కన పెట్టను అన్నట్లు మాట్లాడుతున్నారు. పల్నాడు లో వైసీపీ వాళ్లు ఎంత అరాచక పాలన చేస్తున్నారో చంద్రబాబు లోకానికి చాటిచెప్పేదాకా తెలియలేదు. చివరకు ప్రభుత్వం నుంచి రక్షణ కోసం పార్టీ పునరావాస శిబిరాలు ఏర్పాటుచేసిందంటే... పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థమవుతోంది. చివరకు చంద్రబాబు చలో ఆత్మకూరు పిలుపు ఇవ్వడంతో జగన్ ప్రభుత్వం దిగొచ్చి ప్రజలకు రక్షణ కల్పించింది. అయితే... ఏమిటీ అరాచకం, ఇది ప్రజాస్వామ్య పాలనా లేక ఆటవిక రాజ్యమా అంటూ... పల్నాడులో వైసీపీ అరాచకాలపై ఈరోజు బీజేపీ ధర్నాకు పిలుపునిచ్చింది. అయితే, అకస్మాత్తుగా కోడెల మరణంతో ఆ విషయం పక్కకు వెళ్లిపోయింది. కానీ బీజేపీ జగన్ ను ఓ రేంజిలో విమర్శించింది.

 

బీజేపీ ట్వీట్లు

​ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం ఉందా ? పల్నాడులో జరుగుతున్న అరాచక పాలనను ప్రశ్నించడానికి ప్రజాస్వామ్యబద్ధంగా ధర్నా చేపడితే పోలీసులు గొంతు నొక్కే ప్రయత్నం చేసి అక్రమంగా అరెస్ట్లు చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వానికి అభివృద్ధిని వెనక్కి పరిగెత్తించి, కక్షసాధింపు రాజకీయాలే ప్రధాన అజెండా. 

ప్రజలు ఎన్నో ఆశలతో అధికారం కట్టబెడితే @ysjagan ప్రభుత్వం మూడు నెలలకే తన అసమర్ధతను చాటుకుంది, @YSRCParty కార్యకర్తల అరాచకాలకు హద్దేలేకుండా పోయింది, ప్రజాస్వామ్యానికి నీళ్ళోదిలి పోలీసు రాజ్యానికి శ్రీ కారం చుట్టింది. #UnDemocraticYSRCP 

మీ అప్రజాస్వామిక పాలనను ప్రశ్నిస్తే గృహ నిర్బంధంలో ఉంచడం, మీ కార్యకర్తల అరాచకాలను ఎండగడితే పోలీసులతో దాడులకు పాల్పడటం, మీ అసమర్థతను ప్రజల ముందుకు తీసుకొస్తే కార్యకర్తలను వేధించడం ఇదేనా @ysjagan మీ రాజన్న రాజ్యం? #UnDemocraticYSRCP​   

ఇంతకీ ఏం జరిగింది అంటే... బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఇతర బీజేపీ నేతలు పల్నాడులో వైసీపీ అరాచకాలపై నిరసన ధర్నాకు పిలుపునిచ్చారు. అందులో కన్నా పాల్గొనడానికి వచ్చారు. నిరసన తెలపనీయకుండా కన్నాను అడ్డుకున్న పోలీసులు ఆయనను అరెస్టు చేసి నిర్బంధించారు. దీనిపై ఆగ్రహించిన కన్నా జగన్ సర్కారుపై నిప్పులు చెరిగారు. జగన్ అరాచకవాది అంటూ వ్యాఖ్యానించారు. ఇది ఆటవిక పాలన అంటూ దుయ్యబట్టారు. చివరకు బీజేపీకి వంద రోజుల్లోనే తత్వం బోధపడింది. జగన్ అధికారం చేపడితే ఎలాంటి పరిస్థితులు ఉంటాయని అప్పట్లో టీడీపీ ఆరోపించో అలాంటి పరిస్థితులే ఉన్నాయంటూ... అనవసరంగా బీజేపీ జగన్ ను ఎన్నికల ముందు భుజాలపైకెత్తుకుని మోసింది అంటూ జనం సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు. ​